ఎయిర్‌టె‌ల్‌, ఐడియా, వొడా‌ఫోన్‌కు ‘జియో’ మరోదెబ్బ: రూ.3,050 కోట్ల జరిమానా

ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టెలికాం నియంత్రణ సంస్థ.. ఈ మూడు టెలికాం దిగ్గజాలకు భారీ జరిమానా విధించింది. అక్షరాల రూ.3,050 కోట్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. రిలయన్స్ జియో నెట్‌వర్క్‌తో ఇంటర్‌ కనెక్షన్ల‌కు సహకరించని కారణంగా ట్రాయ్ ఈ విధమైన జరిమానా విధించింది. జియో వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు చేస్తున్న కాల్స్ 75 శాతం తిరస్కరణకు గురవుతున్నాయని రిలయన్స్ సంస్థ ట్రాయ్‌ (టెలికాం నియంత్రణ సంస్థ)కి ఫిర్యాదు చేసింది. దీంతో.. స్పందించిన […]

ఎయిర్‌టె‌ల్‌, ఐడియా, వొడా‌ఫోన్‌కు 'జియో' మరోదెబ్బ: రూ.3,050 కోట్ల జరిమానా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jul 25, 2019 | 8:35 PM

ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టెలికాం నియంత్రణ సంస్థ.. ఈ మూడు టెలికాం దిగ్గజాలకు భారీ జరిమానా విధించింది. అక్షరాల రూ.3,050 కోట్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. రిలయన్స్ జియో నెట్‌వర్క్‌తో ఇంటర్‌ కనెక్షన్ల‌కు సహకరించని కారణంగా ట్రాయ్ ఈ విధమైన జరిమానా విధించింది.

జియో వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు చేస్తున్న కాల్స్ 75 శాతం తిరస్కరణకు గురవుతున్నాయని రిలయన్స్ సంస్థ ట్రాయ్‌ (టెలికాం నియంత్రణ సంస్థ)కి ఫిర్యాదు చేసింది. దీంతో.. స్పందించిన ట్రాయ్ సంస్థ.. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లకు రూ.1,050 కోట్ల చొప్పున జరిమానా విధించగా, ఐడియాకు మాత్రం ఏకంగా రూ.2,000 కోట్ల జరిమానా విధించింది. ప్రస్తుతం వొడాఫోన్, ఐడియా సంస్థలు విలీనమై నూతన కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ జరిమానాను రెండు కంపెనీలు భరించనున్నాయి. కాగా.. జరిమానాలతో పాటు కంపెనీల లైసెన్సులు కూడా రద్దు చేయాలనుకుంది ట్రాయ్ సంస్థ. కానీ.. కోట్లాది వినియోగదారులకు అసౌకర్యం కలుగుతుందని గమనించి కేవలం జరిమానాను మాత్రమే విధించింది.