Whatsapp: వాట్సాప్‌ షాకింగ్ నిర్ణయం.. ఒకే నెలలో 22 లక్షల అకౌంట్స్ బ్యాన్‌.. కారణమేంటో తెలుసా.?

Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏకంగా 22 లక్షల వాట్సాప్‌ అకౌంట్లను బ్యాన్‌ చేసింది. జూన్‌ ఒక్క నెలలోనే వాట్సాప్‌ ఈ స్థాయిలో ఖాతాలను బ్యాన్‌ చేయడం..

Whatsapp: వాట్సాప్‌ షాకింగ్ నిర్ణయం.. ఒకే నెలలో 22 లక్షల అకౌంట్స్ బ్యాన్‌.. కారణమేంటో తెలుసా.?
Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 02, 2022 | 2:47 PM

Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏకంగా 22 లక్షల వాట్సాప్‌ అకౌంట్లను బ్యాన్‌ చేసింది. జూన్‌ ఒక్క నెలలోనే వాట్సాప్‌ ఈ స్థాయిలో ఖాతాలను బ్యాన్‌ చేయడం గమనార్హం. ఇన్ఫర్మేషన్‌ రూల్స్‌ (IT Rules), 2021 ప్రకారం వాట్సాప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదిలా ఉఉంటే వాట్సాప్‌ అకౌంట్లను బ్యాన్‌ చేయడం ఇదే తొలిసారి కాదు గత మే నెలలో 19 లక్షలకుపైగా భారతీయ బాట్సాప్‌ అకౌంట్లపై నిషేధం విధించింది. వాట్సాప్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా వాట్సాప్‌ అకౌంట్లను బ్యాన్‌ చేసింది.

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, అనధికారిక సందేశాలను ఎక్కువ కాంటాక్ట్‌లకు ఫార్వర్డ్‌ చేయడం లాంటివి చేసిన వారి ఖాతాలను వాట్సాప్‌ బ్యాన్‌ చేస్తూ వస్తోంది. ఇక ఎక్కువ సార్లు ఫార్వర్డ్‌ అవుతోన్న సందేశాలపై కూడా వాట్సాప్‌ నిఘా పెడుతోంది. ఇదిలా ఉంటే జూన్‌ నెలలో వాట్సాప్‌కు భారతదేశంలో మొత్తం 632 ఫిర్యాదుల నివేదికలు అందగా వాటిలో 64 ఖాతాలపై చర్యలు తీసుకుంది. ఇక మే నెలలో 528 ఫిర్యాదులు రాగా 24 వాట్సాప్‌ అకౌంట్లపై చర్యలు తీసుకున్నారు.

అభ్యంతకర సందేశాల వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో చాలా ఏళ్లుగా తాము ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్‌ అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు. . గ్రీవియన్స్‌ మెకానిజమ్‌ ద్వారా వాట్సాప్‌ అభ్యంతకర సందేశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తోంది.  వాట్సాప్‌ యూజర్ల సెక్యూరిటీ కోసం పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ పేరుతో ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సహాయంతో వాట్సాప్‌లో సంభాషణ జరుపుకునే ఇద్దరు యూజర్లకు తప్ప ఇతరులకు సమాచారం తెలిసిందే అవకాశం ఉండదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..