AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo New Smart Phones: భారత మార్కెట్‌లోకి దూసుకొస్తున్న వివో కొత్త ఫోన్స్.. లాంచ్ ఎప్పుడో తెలుసా?

స్మార్ట్ ఫోన్లకు పుట్టినిల్లయిన చైనాలో అన్ని కంపెనీలు తమ కొత్త ఫోన్లను అక్కడ లాంచ్ చేస్తాయి. తాజాగా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన వివో తమ స్మార్ట్ ఫోన్ లైనప్‌లో కొత్త సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివో ఎక్స్ 90 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను ఇప్పటికే చైనాలో లాంచ్ చేసింది.

Vivo New Smart Phones: భారత మార్కెట్‌లోకి దూసుకొస్తున్న వివో కొత్త ఫోన్స్.. లాంచ్ ఎప్పుడో తెలుసా?
Vivo X90
Nikhil
| Edited By: |

Updated on: Apr 09, 2023 | 9:45 AM

Share

భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ వాడకానికి ముందుకు రావడంతో టాప్ మొబైల్ కంపెనీలన్నీ కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లకు పుట్టినిల్లయిన చైనాలో అన్ని కంపెనీలు తమ కొత్త ఫోన్లను అక్కడ లాంచ్ చేస్తాయి. తాజాగా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన వివో తమ స్మార్ట్ ఫోన్ లైనప్‌లో కొత్త సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివో ఎక్స్ 90 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను ఇప్పటికే చైనాలో లాంచ్ చేసింది. వివో ఎక్స్ 90, ఎక్స్ 90 ప్రో రెండు ఫోన్లను త్వరలో భారత్‌లో కూడా లాంచ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం వివో కంపెనీ ఈ రెండు ఫోన్లను ఈ నెల 26న లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. అయితే ధర విషయాన్ని పరిశీలిస్తే ఈ రెండు ఫోన్లు కేవలం ఉన్నత శ్రేణి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకునే కంపెనీ తయారు చేసిందని వెల్లడవుతుంది. వివో ఎక్స్90, ఎక్స్ 90 ప్రో ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

వివో ఎక్స్90, ఎక్స్ 90 ప్రో ఫీచర్లు ఇవే

ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్ల గురించి కంపెనీ ఇంకా అధికారింకంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే లీకువీరులు మాత్రం ఈ ఫోన్ల ఫీచర్ల ఇవేనంటూ హల్‌చల్ చేస్తున్నారు. లీకువీరులు వెల్లడించిన ప్రకారం ఈ రెండు ఫోన్లు 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తాయని పేర్కొంటున్నారు. అలాగే ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ద్వారా పని చేస్తాయి. అలాగే మీడియా టెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో వినియోగదారులకు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయని అందరూ అంచనా వేస్తున్నారు. అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం వీ2 చిప్ కూడా ప్రత్యేకంగా ఈ ఫోన్లలో ఉంటుందని తెలుస్తోంది. అయితే వివో ఎక్స్ 90లో వెనుకవైపు 50 ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్‌ కెమెరాతో పాటు 12 ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరా, మరో 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో ట్రై కెమెరా సెటప్‌తో వస్తుంది. అలాగే ఎక్స్ 90 ప్రో కూడా యొక్క కెమెరా 50 ఎంపీ సోనీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో వస్తుంది. అలాగే ఈ రెండు ఫోన్స్‌లో కూడా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అయితే ఎక్స్ 90 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4810 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఎక్స్ 90 ప్రో కూడా 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో పాటు 50 వాట్స్ వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో 4870 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అయితే ఈ రెండు ఫోన్ల ధరలు రూ.60 వేల నుంచి రూ 80 వేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

Follow Us
ఇండస్ట్రీలో ఆయనంటే నాకు క్రష్ ఉండేది..
ఇండస్ట్రీలో ఆయనంటే నాకు క్రష్ ఉండేది..
ఆ విజయం లక్ కాదు.. విమర్శకులకు బవుమా అదిరిపోయే కౌంటర్
ఆ విజయం లక్ కాదు.. విమర్శకులకు బవుమా అదిరిపోయే కౌంటర్
హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లలో DDLJ.. షారుఖ్ బర్త్‌డే స్పెషల్
హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లలో DDLJ.. షారుఖ్ బర్త్‌డే స్పెషల్
న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం..!
న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం..!
కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే
కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే
వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా
వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా
టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్
టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్
ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..
ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..
ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!
ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!
ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్
ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్