Vivo T5X పై భారీ తగ్గింపు.. ఎంత తగ్గిందో తెలిస్తే వెంటనే కొనేస్తారు
Vivo T5x 5G.. భారీ బ్యాటరీ, మంచి కెమెరాతో Vivo T5x 5G ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం Flipkartలో ఈ ఫోన్‌పై తగ్గింపు ధర అందుబాటులో ఉంది. 6GB RAM, 128GB స్టోరేజ్ ఉన్న వేరియంట్‌ను రూ.27,999కే కొనొచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో మరో రూ.2,350 తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.25,649కు తగ్గుతుంది. తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది ఆసక్తికరంగా మారింది.

ఈ ఫోన్‌లో 7200mAh బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. Sony IMX852 సెన్సర్‌తో 50MP కెమెరా ఇచ్చారు. 120Hz డిస్ప్లే, గేమింగ్ సదుపాయాలు, నీరు దుమ్ము నుంచి రక్షణ వంటి ఫీచర్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ మందం 8.39mmగానే ఉంది. బరువు 219g. రోజువారీ వాడకంతో పాటు గేమ్స్ ఆడేవారికి ఉపయోగపడేలా దీన్ని తయారు చేశారు.
పెద్ద డిస్ప్లే
ఈ ఫోన్‌లో Octa-Core MediaTek Dimensity 7400 Turbo 4nm ప్రాసెసర్ ఉంది. Mali G615 MC2 GPU ఉండటంతో గేమింగ్ సమయంలో మంచి పనితీరు అందిస్తుంది. Game Voice Changer, Ultra Game Mode, 4D Game Vibration వంటి గేమింగ్ సదుపాయాలు ఉన్నాయి.
6.76-inch Full HD+ డిస్ప్లే 2408 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits గరిష్ఠ వెలుతురు ఉంటుంది. Android 16 ఆధారిత OriginOS 6పై ఫోన్ పనిచేస్తుంది. 7200mAh బ్యాటరీకి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. స్టీరియో స్పీకర్లు, Type-C ఆడియో, పక్కవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ ఉన్నాయి.
50MP Sony కెమెరా..
వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాకు Sony IMX852 సెన్సర్ ఇచ్చారు. దీనికి 2MP కెమెరా ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. దీనితోనూ 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. బలమైన నిర్మాణానికి MIL-STD-810H ధృవీకరణ ఉంది. IP68, IP69 రేటింగ్‌లతో నీరు, దుమ్ము నుంచి రక్షణ లభిస్తుంది. 5G SA/NSA, 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4 సదుపాయాలు ఉన్నాయి. Cyber Green, Flame Red, Star Silver రంగుల్లో ఈ మోడల్ లభిస్తోంది.
