AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphones: భారత్‌లో ఎక్కువగా అమ్ముడు పోయిన స్మార్ట్ ఫోన్‌ ఏదో తెలుసా.?

గురువారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో.. జనవరి-మార్చి త్రైమాసికంలో భారతదేశంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. ఈ మొదటి నెలల్లో వివో అమ్మకాలు సామ్‌సంగ్‌ను అధిగమించాయి. సామ్‌సంగ్‌ ప్రీమియం మార్కెట్‌లో స్థానం సంపాదించుకున్నా మూడవ స్థానానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది...

Smartphones: భారత్‌లో ఎక్కువగా అమ్ముడు పోయిన స్మార్ట్ ఫోన్‌ ఏదో తెలుసా.?
Smartphone Sale
Narender Vaitla
|

Updated on: May 11, 2024 | 9:11 PM

Share

దేశంలో స్మార్ట్ ఫోన్‌ల విక్రయాలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ ధరలు అందరికీ అందుబాటులోకి రావడం. డిజిటల్‌ ఎకానమీ క్రమంగా పెరుగుతుండడంతో స్మార్ట్ ఫోన్‌ల వినియోగం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

గురువారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో.. జనవరి-మార్చి త్రైమాసికంలో భారతదేశంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. ఈ మొదటి నెలల్లో వివో అమ్మకాలు సామ్‌సంగ్‌ను అధిగమించాయి. సామ్‌సంగ్‌ ప్రీమియం మార్కెట్‌లో స్థానం సంపాదించుకున్నా మూడవ స్థానానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. అయితే సామ్‌సంగ్ వాటాపరంగా మాత్రం లీడర్‌ షిప్‌ను కొనసాగించింది.

వివో, షావోమితో పోల్చితే ఎక్కువ ధర కలిగిన ఫోన్‌ల సెగ్మెంట్‌లో సామ్‌సంగ్ వాటాలో నాలుగింట ఒక వంతును కలిగి ఉంది. సగటు అమ్మకపు ధర 425 డాలర్లుగా ఉంది. ముఖ్యంగా రూ. 20 వేల కంటే ఎక్కవ సెగ్‌మెంట్‌లో సామ్‌సంగ్‌ ఆధిపత్యం కనబర్చింది. Vivo 5G సాంకేతికతలో దాని నాయకత్వం కారణంగా 17.5 శాతం నుండి 19 శాతం వాల్యూమ్ ద్వారా మార్కెట్ వాటాను పొందింది. ఇక చైనాకు చెందిన మరో స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం షావోమీ 18.8 వాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే 3 శాతం పెరగడం విశేషం.

సామ్‌సంగ్‌ 17.5 శాతంతో వెనకబడి ఉంది. గతేడాదితో పోల్చితే 20.3 శాతం తగ్గడం గమనార్హం. ఇక యాపిల్‌ కూడా భారత్‌లో ఈ త్రైమాసికంగా రికార్డు అమ్మకాలను చూసింది. ప్రీమియం విభాగంలో యాపిల్ అగ్ర స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఐఫోన్‌ 15 సేల్స్‌ భారీగా పెరిగాయి. షావోమీ 28 శాతం వృద్ధిని సాధించింది. ఇక చైనాకు చెందిన మరో దిగ్గజం ఒప్పో 10.1 శాతం వాల్యూమ్ షేర్‌తో నాల్గవ స్థానాన్ని పొందగా, రియల్‌మే 9.9 శాతం సంపాదించింది. గతేడాదితో పోల్చితే 18 శాతం అమ్మకాలు పెరిగాయి. ఇక మరో ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం నథింగ్‌ (2ఏ) 144శాతం వేగవంతమైన వృద్ధిని సాధించింది. గతేడాదితో పోల్చితే మోటోరోల అమ్మాకాలు ఏకంగా 58 శాతం పెరగడం విశేషం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..