AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo V30: కొత్త ఫోన్‌ లాంచ్‌ చేసిన వివో.. తక్కువ ధరలో అదిరే ఫీచర్స్‌..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్జం వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వి30 లైట్‌ 4జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెట్లో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ఇదిలా ఉంటే ఇదే మోడల్‌కు సంబంధించి కొన్ని నెలల క్రితం 5జీ వెర్షన్ లాంచ్‌ కాగా తాజాగా వివో 4జీ వెర్షన్‌ను తీసుకొచ్చింది...

Vivo V30: కొత్త ఫోన్‌ లాంచ్‌ చేసిన వివో.. తక్కువ ధరలో అదిరే ఫీచర్స్‌..
Vivo V30 Lite 4g
Narender Vaitla
|

Updated on: Apr 07, 2024 | 6:41 PM

Share

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్జం వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వి30 లైట్‌ 4జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెట్లో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ఇదిలా ఉంటే ఇదే మోడల్‌కు సంబంధించి కొన్ని నెలల క్రితం 5జీ వెర్షన్ లాంచ్‌ కాగా తాజాగా వివో 4జీ వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వివో వీ30 లైట్ 4జీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన అమో ఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్‌లో 80 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌ క్వాల్‌కం స్నాప్‌డ్రాగ్‌ 685 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను ప్రస్తుతం 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో లాంచ్‌ చేశారు. అయితే త్వరలోనే 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను తీసుకురానున్నారు.

ఇక ఈ ఫోన్‌లో కనెక్టివిటీ కోసం 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 22,500గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. వీటిలో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన మెయిన్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో వాటర్‌ రెసిస్టెంట్ కోసం ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందించారు. ఈ ఫోన్‌ మందం 0.79 సెంటీమీటర్లుగా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
1980s ట్రెండ్.. అప్పట్లో కుర్రాళ్ల మతిపోగొట్టిన క్రేజీ బైక్స్ ఇవే
1980s ట్రెండ్.. అప్పట్లో కుర్రాళ్ల మతిపోగొట్టిన క్రేజీ బైక్స్ ఇవే
DMartలో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే టిప్స్‌.. ఇలా చేస్తే చాలు..
DMartలో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే టిప్స్‌.. ఇలా చేస్తే చాలు..
నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్? అందులోని డేంజర్ కెమికల్స్ ఇవే
నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్? అందులోని డేంజర్ కెమికల్స్ ఇవే
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!