AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లతో ఇయర్‌‌బడ్స్​ కొనాలనుకుంటున్నారా? TRIGGR Wukong కంటే బెస్ట్‌ ఉందా?

వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రయాణాల సమయంలో పాటలు వినడం, ఆఫీసు మీటింగ్‌లలో పాల్గొనడం, ఫోన్ కాల్స్ మాట్లాడటం వంటి అవసరాల కోసం చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో బయటి శబ్దాలు ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు Active Noise Cancellation (ANC) ఫీచర్ ఉపయోగపడుతుంది. గతంలో ఈ సదుపాయం ఎక్కువ ధర కలిగిన ప్రీమియం ఇయర్‌బడ్స్‌లో మాత్రమే కనిపించేది. ఇప్పుడు బడ్జెట్ విభాగంలోనూ ఈ ఫీచర్‌తో కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో TRIGGR Wukong TWS ఇయర్‌బడ్స్ ఒకటి.

బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లతో ఇయర్‌‌బడ్స్​ కొనాలనుకుంటున్నారా? TRIGGR Wukong కంటే బెస్ట్‌ ఉందా?
Triggr Wukong Earbuds.jpg
Nikhil
|

Updated on: Nov 04, 2026 | 6:10 AM

Share

తక్కువ ధరలోనే 35dB ANC, ENC కాలింగ్, 60 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లను TRIGGR Wukong TWS మోడల్ అందిస్తోంది. అంతేకాకుండా ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే సదుపాయం, గేమింగ్ కోసం లో లేటెన్సీ మోడ్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా రూ.1,000లోపు ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్న వారికి ఈ ఫీచర్లు ఆకర్షణీయంగా అనిపించవచ్చు. మరి TRIGGR Wukongలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

ENCతో క్లియర్ కాల్స్!

TRIGGR Wukong ఇయర్‌బడ్స్‌లో ప్రధాన ఆకర్షణ 35dB Active Noise Cancellation టెక్నాలజీ. ప్రయాణాల సమయంలో లేదా రద్దీగా ఉండే ప్రదేశాల్లో చుట్టుపక్కల శబ్దాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల పాటలు వినేటప్పుడు, ఆడియో కంటెంట్ ఆస్వాదించేటప్పుడు బయటి శబ్దాల వల్ల కలిగే అంతరాయం తగ్గుతుంది. అయితే శబ్దాల తీవ్రత, పరిసరాలను బట్టి ANC పనితీరు మారవచ్చు.

ఫోన్ కాల్స్ కోసం ఇందులో ENC (Environmental Noise Cancellation) సిస్టమ్‌ను అందించారు. పరిసరాల్లోని అనవసరమైన శబ్దాలను తగ్గించి, మాట్లాడే వ్యక్తి గొంతు అవతలి వారికి స్పష్టంగా వినిపించేలా ఇది పనిచేస్తుంది. ఒకేసారి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వంటి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే డ్యూయల్ పెయిరింగ్ సదుపాయం కూడా ఉంది. దీంతో ల్యాప్‌టాప్‌లో ఆడియో వింటూనే ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను స్వీకరించవచ్చు.

గేమింగ్ మోడ్!

బ్యాటరీ విషయంలో TRIGGR Wukong ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 60 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తాయని కంపెనీ పేర్కొంటోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలో ఛార్జింగ్ చేసి తిరిగి ఉపయోగించుకోవచ్చు. అయితే వాస్తవ బ్యాటరీ బ్యాకప్ వాల్యూమ్, ANC వినియోగం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

గేమింగ్ ప్రియుల కోసం ఇందులో లో లేటెన్సీ మోడ్‌ను అందించారు. ఇది గేమ్‌లోని శబ్దాలు, తెరపై కనిపించే దృశ్యాల మధ్య ఆలస్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. డిజైన్ విషయానికి వస్తే ఆధునిక రూపంతో పాటు తక్కువ బరువు, సులభంగా తీసుకెళ్లగలిగే కాంపాక్ట్ ఛార్జింగ్ కేస్‌ను కలిగి ఉంది.

ధర విషయానికి వస్తే TRIGGR Wukong ఇయర్‌బడ్స్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆఫర్లతో సుమారు రూ.899కు లభిస్తున్నట్లు సమాచారం. 35dB ANC, ENC కాలింగ్, డ్యూయల్ పెయిరింగ్, 60 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఈ ధరలో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

Follow Us