OTP: బ్యాంకు లావాదేవీలు, ఈ-కామర్స్‌, ఆధార్‌ వెరిఫికేషన్ తదితర‌ ఓటీపీలు రావడం లేదా..? కారణం ఇదేనట..!

|

Mar 09, 2021 | 9:30 PM

OTP: బ్యాంకు లావాదేవీలు, రైల్వే టికెట్ల బుకింగ్‌, ఈ-కామర్స్‌, ఆధార్‌ వెరిఫికేషన్‌ ఇలా ఎన్నో రకాల సేవలకు ఓటిపీ తప్పకుండా అవసరం. మ...

OTP: బ్యాంకు లావాదేవీలు, ఈ-కామర్స్‌, ఆధార్‌ వెరిఫికేషన్ తదితర‌ ఓటీపీలు రావడం లేదా..? కారణం ఇదేనట..!
Follow us on

OTP: బ్యాంకు లావాదేవీలు, రైల్వే టికెట్ల బుకింగ్‌, ఈ-కామర్స్‌, ఆధార్‌ వెరిఫికేషన్‌ ఇలా ఎన్నో రకాల సేవలకు ఓటిపీ తప్పకుండా అవసరం. మన మొబైల్‌కు వచ్చిన వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP) ఎంటర్‌ చేస్తేనే మన లావాదేవీలు పూర్తయినట్లు. లేకపోతే అంతే. కానీ రెండు రోజులుగా చాలా మందికి ఓటీపీలు రావడం లేదని, మరి కొంత మందికి ఓటీపీలు ఆలస్యంగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ కారణంగా లావాదేవీలు పూర్తి చేసేందుకు వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలా ఉన్నట్టుండి ఓటీపీ వ్యవస్థ సరిగా పని చేయకపోవడానికి టెల్కోలు కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన నిబంధనలే కారణమని తెలుస్తోంది.

ఓటీపీ మోసాలను అరికట్టేందుకు డిస్ట్రీబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ ప్లాట్‌ ఫామ్‌ (డీఎల్‌టీ)ని అమలు చేయాలని టెలికాం కంపెనీలకు టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) 2018 నుంచే సూచిస్తూ వస్తోంది. అయితే ఇందుకు టెలికం సంస్థలు మాత్రం ముందుకు రాలేకపోయాయి. ఈ నేపథ్‌యంలో ట్రాయ్‌ ఆదేశాల మేరకు సోమవారం డీఎల్‌టీని అమల్లోకి తీసుకువచ్చాయి. ఈ నిబంధనల్లో కొంత గందరగోళం నెలకొంది. కొత్త రూల్స్‌ అమలు కారణంగా సోమవారం సాయంత్రం దాదాపు 40 శాతం ఎస్‌ఎంఎస్‌లు నిలిచిపోయాయి. మంగళవారం సమస్య మెరుగుపడ్డప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని తెలుస్తోంది. దీనిపై టెలికం సంస్థలు, పేమెంట్‌ సహా ఇతర సంస్థలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. కొత్త నిబంధనలను అమలు చేసే ప్రక్రియలో పేమెంట్‌ సంస్థలు చేసిన తప్పిదమే ఇందుకు కారణమని టెల్కోలు తెలిపారు. మెసేజ్‌లు పంపేవారి ఐడీలను కొత్తగా తీసుకువచ్చిన బ్లాక్‌ చైన్‌ ప్లాట్‌ఫామ్‌పై రిజిస్టర్‌ చేయకపోవడం కారణంగానే సందేశాలు వెళ్లలేకపోయాయని పేర్కొన్నారు.

ఈ కొత్త నిబంధన ప్రకారం.. కంపెనీలు, బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ కంపెనీలు, గవర్నమెంట్‌ ఏజన్సీలు, టెలీ మార్కెటింగ్‌ కంపెనీలు, డిస్ట్రీబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా టెలికం ఆపరేటర్లతో సంబంధించి టెలీ మార్కెటింగ్ సంస్థ‌లు .. టెలికం కంపెనీల‌కు వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే టెలికం కంపెనీలు ట్రాయ్‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇందు కోసం బ్లాక్‌ చైన్‌ సాంకేతికతను అమల్లోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే మెసేజింగ్‌ టెంప్లెట్స్‌ ద్వారా వినియోగదారులకు సందేశాలు పంపిస్తారు. ఇందులో రిజిస్టర్‌ అయిన ఐడీల నుంచే వచ్చే మెసేజ్‌లను మాత్రమే ధృవీకరించుకుని వినియోగదారుడికి పంపిస్తారు. రిజిస్టర్‌ కానీ ఐడీల నుంచి వచ్చే సందేశాలను నిలిపివేస్తారు.

ఇవి చదవండి:

Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు

Flipkart Smartphone Carnival: ప్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు.. 20 స్మార్ట్‌ ఫోన్‌లపై రూ. 10,000 వరకు డిస్కౌంట్‌

Gold Price: బంగారం ప్రియులకు శుభవార్త.. పసిడి కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమేనా..? రూ.13 వేలు తగ్గిన బంగారం