Security Password: స్ట్రాంగ్ అండ్ సేఫ్ పాస్‌వర్డ్.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. హ్యాకర్ల నుంచి తప్పించుకోండి..

Security Password: వస్తువైనా, డివైజ్ అయినా, సోషల్ మీడియా యాప్స్ అయినా.. ఏదైనా సరే ముందుగా మనం వాటి సెక్యూరిటీ గురించి ఆలోచిస్తాం.

Security Password: స్ట్రాంగ్ అండ్ సేఫ్ పాస్‌వర్డ్.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. హ్యాకర్ల నుంచి తప్పించుకోండి..
Password
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 21, 2021 | 8:34 AM

Security Password: వస్తువైనా, డివైజ్ అయినా, సోషల్ మీడియా యాప్స్ అయినా.. ఏదైనా సరే ముందుగా మనం వాటి సెక్యూరిటీ గురించి ఆలోచిస్తాం. ఫోన్‌ కొనుగోలు చేసినా.. కంప్యూటర్ కొనుగోలు చేసినా, మరేదైనా ఎలక్ట్రానిక్ డివైజ్ కొనుగోలు చేసినా వాటికి సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ని ఏర్పాటు చేసుకుంటాం. అలాగే సోషల్ మీడియా, ఇతర యాప్స్‌కు కూడా పాస్‌వర్డ్ పెట్టుకుంటాం. అయితే, మనం ఎంత సెక్యూరిటీ పాస్‌వర్డ్ పెట్టుకున్నా కొన్ని కొన్ని సార్లు హ్యాకింగ్‌కు గురవుతుంటాయి. అలా హ్యాకింగ్‌కు గురవడానికి మనం చేసే చిన్న చిన్న తప్పులే కారణం అని ఓ సర్వే సంస్థం తేల్చింది. మరి మనం చేసే తప్పులేంటి?.. ఆ సర్వే సంస్థ ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా నోబిఫోర్ అనే అధ్యయన సంస్థ పాస్‌వర్డ్ వినియోగంపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో వ్యక్తులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే యాప్‌లు, డివైజ్‌లు హ్యాకింగ్‌కు గురవుతున్నాయని తేల్చింది. ఇక మ్యాటర్‌లోకి వెళ్తే.. 24 శాతం మంది ఉద్యోగులు తమ పాస్‌వర్డ్‌లను తాము వాడే డివైజ్‌లలో సేవ్ చేస్తారట. కారణం మళ్లీ మళ్లీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ఎందుకు అని భావించటం ఒక కారణమైతే.. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టంగా భావించి.. ఒకేసారి సేవ్ చేస్తారట. అలా చేయడం ద్వారా నేరుగా లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉందని సదరు వ్యక్తుల అభిప్రాయం అట. అయితే, ఇది అంత సురక్షితం కాదని సదరు అధ్యయన సంస్థ హెచ్చరిస్తుంది. ఇలా సేవ్ చేయడం ద్వారా హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను పసిగట్టి, యాక్సెస్ చేసుకునే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఇంకా.. సులభమైన పాస్‌వర్డ్‌ను పెట్టి, ఒకే పాస్‌వర్డ్‌ను వివిధ ప్రాంతాల్లో వినియోగించడం వల్ల హ్యాకర్ల పని మరింత సులభతరం చేసినట్లు అవుతుందని నోబీఫోర్ రీసెర్చ్ మేనేజింగ్ డైరెక్టర్ కై రోయర్ హెచ్చరించారు.

ప్రపంచ వ్యాప్తంగా 1,60,000 మందిని పాస్‌వర్డ్ అంశంపై అధ్యయనం చేసినట్లు నోబీఫోర్ అధ్యయన సంస్థ పేర్కొంది. దాదాపు నలుగురిలో ముగ్గురు వ్యక్తులు పాస్‌వర్డ్‌ను పదే పదే టైప్ చేయకుండా సేవ్ చేసిపెట్టుకుంటారని తేల్చింది. ఇదే సమయంలో ఇతర సర్వేలు 25 శాతం కంటే తక్కువ మంది తమ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడానికి ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్‌ని ఉపయోగిస్తున్నట్లు తేల్చాయి.

‘‘మనలో చాలామంది ఆన్‌లైన్ సేవలు, ఇతర పనుల కోసం ఇంట్లో, పని చేసే చోట ఒకే విధమైన పాస్‌వర్డ్స్ వినియోగిస్తుంటారు. అయితే, ఇలా అన్నిచోట్లా ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం చాలా ప్రమాదకరం. ఇది మీ ఖాతాలను హ్యాకర్లు యాక్సెస్ చేయడాన్ని మరింత సులభతరం చేస్తుంది.‘’ అని రోయర్ వివరించారు. ఇక కొన్నేళ్లుగా పలు కంపెనీలు, తమ ఉద్యోగులకు పాస్‌వర్డ్స్ విషయంలో కీలక సూచనలు చేస్తున్నాయని, సంక్లిష్టమైన, సురక్షితమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవాలని సూచిస్తున్నాయని రోయర్ చెప్పుకొచ్చారు. అయితే క్లిష్టంగా ఉండే పాస్‌వర్డ్‌లను గుర్తించుకోవడం కష్టం అవుతుండటంతో చాలా మంది ఉద్యోగులు తమ పాస్‌వర్డ్‌లను తిరిగి ఉపయోగించడానికి సేవ్ ఆప్షన్‌ను ఎంచుకుంటారని తెలిపారు.

‘ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే.. మరెవరూ యాక్సెస్ చేసుకోని చోట మీరు మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేసుకోవడం మంచిది. మీ మొబైల్ ఫోన్, నోట్‌బుక్‌లో మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేసుకోవడం ఉత్తమం. అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో పాస్‌వర్డ్స్‌లను భద్రపరిచేందుకు చాలా యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ‘పాస్‌వర్డ్ మేనేజర్’ ను ప్రముఖంగా చెప్పవచ్చు. ఇవి మీ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడానికి ఉపకరిస్తాయి.’ అని రోయర్ తెలిపారు.

సురక్షితమైన, స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ కోసం రోయర్ చెప్పిన మూడు చిట్కాలు: 1. ప్రత్యేకమైన, పొడవైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోవాలి. మీరు ఉపయోగించే ప్రతి సేవకు ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవడం మరింత సురక్షితం. పాస్‌వర్డ్‌ ఒకే ఫార్మాట్‌లో ఉండకుండా.. ఒక వాక్యం, కొన్ని ప్రత్యేక అక్షరాలు, సంఖ్యలు ఉపయోగించి పాస్‌వర్డ్‌ని సెట్ చేసుకోవాలి.

2. అనేక పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే. అయితే, మరెవరూ ఉపయోగించని డివైజ్‌లలో మాత్రమే మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేసుకోండి. అలా చేయడం ద్వారా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం తక్కువ.

3. అనేక పాస్‌వర్డ్స్ ఉంటే గనుక ‘పాస్‌వర్డ్ మేనేజర్’ను ఉపయోగించడం మేలు అని రోయర్ చెబుతున్నారు. సంక్లిష్టమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడానికి ఇది సురక్షితమైన మార్గం అని రోయర్ పేర్కొన్నారు. ప్లే స్టోర్‌లో చాలా ప్రోగ్రామ్‌లు, అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయని వాటిని కూడా ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. ఇంకా ఐటీ వాళ్ల సలహాలు మీకు మరింత ఉపకరిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

Also read:

Petrol Diesel Price Today: స్థిరంగా చమురు ధరలు.. ఏపీ, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయంటే..

ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఓవర్సీస్‌ విద్యా పథకం ఎంతో అద్భుతం: మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. ఎవరి వ్యూహం వారిదే..
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. ఎవరి వ్యూహం వారిదే..
టాలీవుడ్ రేసులో భాగ్య శ్రీ బోర్సే దూకుడు.! ఎందుకు ఇంత క్రేజ్.?
టాలీవుడ్ రేసులో భాగ్య శ్రీ బోర్సే దూకుడు.! ఎందుకు ఇంత క్రేజ్.?
ఇంట్లో చెదలు శాశ్వతంగా పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ఇంట్లో చెదలు శాశ్వతంగా పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మొన్న రూ. 8 కోట్లు.. కట్‌చేస్తే.. నేడు రూ. 23 కోట్లకు పైగానే
మొన్న రూ. 8 కోట్లు.. కట్‌చేస్తే.. నేడు రూ. 23 కోట్లకు పైగానే
అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆరోజు నుంచే స్ట్రీమింగ్
అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆరోజు నుంచే స్ట్రీమింగ్
R Ashwin: గతేడాది రూ. 5 కోట్లు.. కట్‌చేస్తే.. ఊహించని ప్రైజ్‌
R Ashwin: గతేడాది రూ. 5 కోట్లు.. కట్‌చేస్తే.. ఊహించని ప్రైజ్‌
అవునా.! నిజామా.! దళపతి చివరి సినిమా బాలయ్య సూపర్ హిట్‌కు రీమేక్.?
అవునా.! నిజామా.! దళపతి చివరి సినిమా బాలయ్య సూపర్ హిట్‌కు రీమేక్.?
రాయల సీమ స్టైల్‌లో నాటు కోడి పులుసు ఇలా చేశారంటే అదుర్సే ఇక!
రాయల సీమ స్టైల్‌లో నాటు కోడి పులుసు ఇలా చేశారంటే అదుర్సే ఇక!
ఆలుగడ్డలతో టేస్టీ పూరీలు.. వరుస పెట్టి తింటూనే ఉంటారు..
ఆలుగడ్డలతో టేస్టీ పూరీలు.. వరుస పెట్టి తింటూనే ఉంటారు..
గ్యారెంటీ వార్.. కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు
గ్యారెంటీ వార్.. కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.