Samsung Galaxy A34: తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
శామ్సంగ్ గెలాక్సీ ఏ34 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీని ధరను బాగా తగ్గించి ఆ కంపెనీ విక్రయిస్తోంది. దీనిలో అనేక బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అన్నిటికన్నా ఆకట్టుకునే ఫీచర్ ఏమిటంటే ఇది వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారందరికీ ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. బెస్ట్ బ్రాండ్, లెటెస్ట్ ఫీచర్లు, వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ కలిగిన ఈ ఫోన్ ప్రత్యేకతలను తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. అతి తక్కువ ధరకే ప్రత్యేక ఫీచర్లు కలిగిన ప్రముఖ బ్రాండ్ ఫోన్‌ను పొందే అవకాశం ఉంది. అందరూ ఇష్టపడే శామ్సంగ్ నుంచి వాటర్ ప్రూఫ్ మొబైల్ లభిస్తుంది. ఈ ఫోన్‌ను చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పేరు శామ్సంగ్ గెలాక్సీ ఏ34 5జీ. ఇది చాలా చవకైన ధరకే లభిస్తోంది. దీనిలో ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
శామ్సంగ్ గెలాక్సీ ఏ34..
శామ్సంగ్ గెలాక్సీ ఏ34 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీని ధరను బాగా తగ్గించి ఆ కంపెనీ విక్రయిస్తోంది. దీనిలో అనేక బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అన్నిటికన్నా ఆకట్టుకునే ఫీచర్ ఏమిటంటే ఇది వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారందరికీ ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. బెస్ట్ బ్రాండ్, లెటెస్ట్ ఫీచర్లు, వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ కలిగిన ఈ ఫోన్ ప్రత్యేకతలను తెలుసుకుందాం.
తక్కువ ధర..
సామ్సంగ్ విడుదల చేసిన గెలాక్సీ ఏ34 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. దీనిలోని 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,499కు అందుబాటులో ఉంది. గతంలో దీని ధర 30,999 ఉండేది. అలాగే 256 స్టోరేజీ వేరియంట్ రూ.26,499కే లభిస్తుంది. గతంలో ఈ ఫోన్ కావాలంటే రూ.32,999కు కొనుగోలు చేయాల్సి వచ్చేంది. సామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ కార్డు సహాయంతో వీటిని కొనుగోలు చేస్తే మరో వెయ్యి రూపాయల వరకూ తగ్గింపును పొందవచ్చు.
ప్రత్యేకతలు..
సామ్సంగ్ గెలాక్సీ ఏ34 స్మార్ట్ ఫోన్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దీని 6.6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే తో ఎంతో స్పష్టంగా చూడవచ్చు. అలాగే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఏర్పాటు చేశారు. 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ సమస్య ఉండదు. ఓఐఎస్ మద్దతుతో వచ్చే 48 ఎంపీ ప్రధాన కెమెరాతో చిత్రాల నాణ్యత బాగుంటుంది. వీటితో పాటు 8 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలతో 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు.
కొనుగోలుదారుల ఆసక్తి..
స్మార్ట్‌ఫోన్ కనీస అవసరంగా మారిన ఈ రోజుల్లో అనేక ఫీచర్లు కలిగిన ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్‌లోని పోటీ నేపథ్యంలో వినియోగదారులకు తక్కువ ధరకే దొరుకుతున్నాయి. తమకు అవసరమైన ఫీచర్ల కలిగిన ఫోన్ ను ఎంపిక చేసుకోవడమే కొనుగోలుదారుల పని. ఈ నేపథ్యంలో తగ్గింపు ధరలు, డిస్కౌంట్ పై అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తగ్గింపు ధరలకు వస్తున్న ఇలాంటి పోన్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..