Best washing machines: ఈ వాషింగ్ మెషీన్లలో ఫీచర్ల ఎక్కువ.. ధర తక్కువ.. అమెజాన్ లో భారీ డిస్కౌంట్..
ప్రతి కుటుంబానికి వాషింగ్ మెషీన్ నేడు అత్యవసరంగా మారింది. ప్రస్తుతం మగవారితో పాటు ఆడవారు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ కుటుంబానికి సాయంగా ఉంటున్నారు. గతంలో మాదిరిగా దుస్తులను చేతితో ఉతికడానికి సమయం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో వాషింగ్ మెషీన్ల వినియోగం బాగా పెరిగింది. మనకు ఉపయోగపడే అనేక ఫీచర్లతో రకరకాల కంపెనీల మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి.
ప్రతి కుటుంబానికి వాషింగ్ మెషీన్ నేడు అత్యవసరంగా మారింది. ప్రస్తుతం మగవారితో పాటు ఆడవారు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ కుటుంబానికి సాయంగా ఉంటున్నారు. గతంలో మాదిరిగా దుస్తులను చేతితో ఉతికడానికి సమయం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో వాషింగ్ మెషీన్ల వినియోగం బాగా పెరిగింది. మనకు ఉపయోగపడే అనేక ఫీచర్లతో రకరకాల కంపెనీల మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ప్రముఖ కంపెనీల వాషింగ్ మెషీన్లు భారీ డిస్కౌంట్ పై విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫ్రంట్ లోడ్ 7 కేజీల మెషీన్లపై దాదాపు 32 శాతం వరకూ తగ్గింపు ప్రకటించారు. వివిధ రకాల బ్యాంకు కార్డులతో లావాదేవీలు నిర్వహిస్తే పదిశాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉన్న వాషింగ్ మెషీన్ల, ధర, ఇతర ప్రత్యేకతలు ఇవే..
ఎల్ జీ
ఈ వాషింగ్ మెషీన్ లో 1200 ఆర్పీఎం మోటారు కారణంగా పనితీరు వేగంగా ఉంటుంది. స్టీమ్ వాష్, డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ, మోషన్ డీడీ వాష్, బేబీ కేర్ మెకానిజం తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. మెషీన్ నిశ్శబ్దంగా పనిచేయడంతో పాటు వివిధ రకాల దుస్తులను ఉతుకుతుంది. ఈ ఫ్రండ్ లోడ్ వాషింగ్ మెషీన్ లో పది వాష్ ప్రోగ్రామ్ లు ఉన్నాయి. ఎల్ జీ 7 కేజీ 5 స్టార్ ఫుల్లీ ఆటోమెటిక్ ఫ్రంట్ డోర్ వాషింగ్ మెషీన్ ధర రూ.29,990.
సామ్సంగ్
ఈ వాషింగ్ మెషీన్ లో 1200 ఆర్పీఎం స్పిన్ స్పీడ్ ఫీచర్ తో బట్టలను చాలా వేగంగా ఉతుకుతుంది. డైమండ్ డ్రమ్, ఇన్ బిల్ట్ హీటర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దుస్తులను శుభ్రంగా ఉతకడానికి, వేగంగా ఆరపెట్టడానికి వీలు కలుగుతుంది. దీనిలో దాదాపు 20 రకాల వాష్ ప్రోగ్రామ్ లు ఉన్నాయి. ఈ సామ్సంగ్ 7 కేజీ 5 స్టార్ ఆటోమెటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ అమెజాన్ లో రూ.30 శాతం డిస్కౌంట్ పై రూ.33,990కు అందుబాటులో ఉంది.
ఎల్ జీ
ఈ వాషింగ్ మెషీన్ లో పది రకాల ప్రోగ్రామ్ లు ఉన్నాయి. దీనిలోని 6 మోషన్ డీడీ వాష్ ఫీచర్ తో స్క్రబ్బింగ్, టంబ్లింగ్, రోలింగ్ తదితర వాటి ద్వారా కఠిన మైన మరకలను పూర్తిగా తొలగిస్తుంది. 1200 ఆర్ఫీఎం మోటారుతో వేగంగా పనిచేస్తుంది. స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేసిన డ్రమ్, పల్సేటర్ తో మెషీన్ మన్నిక చాలా బాగుంటుంది. ఈ ఎల్ జీ 7 కేజీ స్టార్ ఫుల్లీ ఆటోమెటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ 31 శాతం తగ్గింపుపై రూ.26,990కి అందుబాటులో ఉంది.
ఐఎఫ్ బీ
దీనిలో ఏడు రకాల వాష్ ప్రోగ్రామ్ లు ఉన్నాయి. 2 డీ వాష్, పవర్ స్టీమ్ సైకిల్ తో పనితీరు వేగంగా ఉండడంతో పాటు బట్టల నుంచి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఈ ఏఐ పవర్డ్ వాషింగ్ మెషీన్ కు స్మార్ట్ మోహన్ మద్దతు ఉంది. 1000 ఆర్పీఎం తో వాషింగ్ చాలా వేగంగా జరుగుతుంది. ఐఎఫ్ బీ ఏడు కేజీల వాషింగ్ మెషీన్ పై 22 శాతం తగ్గింపు ప్రకటించారు. అమెజాన్ లో రూ.35,999కి దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు.
వర్ల్ పూల్
దుస్తులపై ఏర్పడిన కఠిన మైన మరకలను వంద శాతం శుభ్రం చేయడం ఈ వాషింగ్ మెషీన్ ప్రత్యేకత. ఉన్ని తదితర వాటిని శుభ్రం చేయడానికి దీనిలో సెన్స్ మూవ్ టెక్నాలజీ ఉంది. 15 వాష్ ప్రోగ్రామ్ ల ద్వారా పనితీరు వేగంగా, నాణ్యతగా ఉంటుంది. చిన్న, మధ్య తరహా కుటుంబాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వర్ల్ పూల్ 7 కేజీల 5 స్టార్ ఇన్వర్టర్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ను రూ.26,990కు కొనుగోలు చేసుకోవచ్చు.