Laptops Under 20K: తక్కువ ధరలోనే బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే.. సూపర్ ఫీచర్లు తెలిస్తే ఎగిరిగంతేస్తారంతే..!
ప్రపంచవ్యాప్తంగా ల్యాప్‌టాప్ వినియోగం విపరీతంగా పెరిగింది. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో విద్యారంగంలో వచ్చిన కీలక మార్పుల వల్ల ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరిగింది. అలాగే కరోనా లాక్‌డౌన్ తర్వాత వర్క్‌ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. దీంతో ల్యాప్‌టాప్ వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి తక్కువ ధరల్లోనే ల్యాప్‌టాప్‌లను కొన్ని కంపెనీలు తీసుకొచ్చాయి. ఫీచర్లు, పనితీరు విషయాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రూ.20 వేల లోపు అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్స్ గురించి ఓసారి తెలుసుకుందాం.
Updated on: Dec 10, 2023 | 2:42 PM

చువి హీరో బుక్ ప్రో ల్యాప్‌టాప్ ప్రారంభ అవసరాలతో పాటు ఇతర విద్యార్థుల అవసరాలకు సరిగ్గా సరిపోయే ల్యాపటాప్. 14.1 ఇంచెస్ స్క్రీన్‌తో వచ్చే ఈ ల్యాప్ 8 జీబీ ర్యామ్‌తో పాటు 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే 2.8జీహెచ్‌జెడ్‌వరకు పునరుద్ధరించే ఇంటెల్ సెలిరాన్ ఎన్4020 ప్రాసెసర్‌తో ద్వారా పని చేస్తుంది. ముఖ్యంగా గేమింగ్ ప్రియులకు కూడా ఈ ల్యాప్‌టాప్ అనువుగా ఉంది. ఈ ల్యాప్ ప్రస్తుతం 46 శాతం తగ్గింపుతో రూ.18,990కు అమెజాన్ వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఫుటోపియా అల్టిమస్ లైట్ ల్యాప్‌టాప్ అద్బుత పనితీరుతో తక్కువ ధరతో వచ్చే సూపర్ ల్యాప్‌టాప్ అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. సొగసైన క్లౌడ్ సిల్వర్ ఎక్ట్సీరియర్‌తో పాటు 14.1 అంగుళాల యాంటీ-గ్లేర్ స్క్రీన్ ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత ఇంటెల్ సెలిరాన్ ఎన్ 4020 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్ 8 జీబీ ర్యామ్‌తో వస్తుంది. ముఖ్యంగా విండోస్ 11 ప్రాసెసర్‌తోవచ్చే ఈ ల్యాప్‌టాప్ ధర రూ.15,990.

లెనోవో ఈ 44-55 ఏఎండీ ల్యాప్‌టాప్ 14 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఏఎండీ అథ్లాన్ ఏ3050యూ ప్రాసెసర్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్ 4 జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు కేవలం 1.59 కిలోలు ఉంటుంది. అలాగే 256 జీబీ ఎస్‌ఎస్‌డీ వచ్చే ఈ ల్యాప్‌టాప్ రోజువారీ అవసరాలకు అనువుగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్‌ను రూ.18,990కు సొంతం చేసుకోవచ్చు.

ఏసర్ జెడ్8-284 ల్యాప్‌టాప్ 1.1 జీహెచ్‌జెడ్ సెలెరాన్ సీపీయూ ద్వారా పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్ 11.6 అంగుళా స్క్రీన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. 1.1 కేజీల బరువుతో విద్యార్థులకు ఈ ల్యాప్‌టాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ దర రూ.17,990.

హెచ్‌పీ 255 జీ9 ల్యాప్‌టాప్ తక్కువ ధరల్లోనే వచ్చే మంచి ల్యాప్‌టాప్. ముఖ్యంగా 15.6-అంగుళాల బ్లాక్ స్క్రీన్‌తో యాంటీ గ్లేర్ కోటింగ్ ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత. మైక్రో ఎడ్జ్ డిస్‌ప్లేతో మీ రోజువారీ పనులకు అధునాతనతను జోడిస్తుంది. అథ్లాన్ సీపీయూ, 4 జీబీ ర్యామ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ సాఫీగా మల్టీ టాస్కింగ్ కోసం అనువుగా ఉంటుంది. అలాగే 256 జీబీ ఎస్‌ఎస్‌డీతో ఆకట్టుకునే ఈ ల్యాప్‌టాప్ ధర రూ.20,000.




