Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2023: మీ సోదరికి ఈ టెక్ గ్యాడ్జెట్లను గిఫ్ట్‌గా ఇవ్వండి.. ఫిదా అయిపోతారు.. రోజూ ధరిస్తారు..

రాఖీ పండుగ రోజు బహుమతులు ఇవ్వడం పరిపాటి. మీ ప్రియమైన చెల్లి లేదా అక్కకు ఎప్పుడే మాదిరి కాకుండా ఈసారి వస్తు రూపంలో అది కూడా స్మార్ట్ గ్యాడ్జెట్ ను బహుమతిగా ఇస్తే ఎలా ఉంటుంది? అది కూడా తను రోజూ ధరించేలా, వినియోగించేలా ఒక వస్తువును ఇస్తే బావుంటుంది కాదా! అలాంటి బెస్ట్ వేరబుల్ స్మార్ట్ గ్యాడ్జెట్లను మీకు పరిచయం చేస్తున్నాం. కథనం పూర్తిగా చదవండి..

Raksha Bandhan 2023: మీ సోదరికి ఈ టెక్ గ్యాడ్జెట్లను గిఫ్ట్‌గా ఇవ్వండి.. ఫిదా అయిపోతారు.. రోజూ ధరిస్తారు..
Rakhi Gift
Follow us
Madhu

|

Updated on: Aug 30, 2023 | 3:36 PM

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా మన దేశంలో రక్షా బంధన్.. రాఖీ పండుగను జరుపుకుంటారు. మీ ప్రియమైన సోదరీలకు సోదరులు అండగా, నేనున్నా అనే ధైర్యాన్ని ఇవ్వడమే ఈ రాఖీ ఉద్దేశంగా చాలా మంది చెబుతుంటారు. సంప్రదాయ ప్రకారం రాఖీ పండుగ రోజు ఇంట్లో ఆడపడుచులు తలంటు స్నానం చేసేసి, కొత్త వస్త్రాలు ధరించుకొని తమ సోదరుల మణికట్టుకు తమ బంధానికి ప్రతీకగా రాఖీని కడుతుంటారు. అదేసమయంలో వారి నోటిని ఏదైనా స్వీట్ తో తీపి చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు ప్రతిగా సోదరీలకు మంచి బహుమతులను సోదరులు ఇస్తుంటారు. మీరు మీ ప్రియమైన చెల్లి లేదా అక్కకు ఎప్పుడే మాదిరి కాకుండా ఈసారి వస్తు రూపంలో అది కూడా స్మార్ట్ గ్యాడ్జెట్ ను బహుమతిగా ఇస్తే ఎలా ఉంటుంది? అది కూడా తను రోజూ ధరించేలా, వినియోగించేలా ఒక వస్తువును ఇస్తే బావుంటుంది కాదా! అలాంటి బెస్ట్ వేరబుల్ స్మార్ట్ గ్యాడ్జెట్లను మీకు పరిచయం చేస్తున్నాం. కథనం పూర్తిగా చదవండి..

యాపిల్ వాచ్ సిరీస్ 8.. ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న అడ్వాన్స్ డ్ స్మార్ట్ వాచ్. దీనిలో ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ ప్లే ఉంటుంది. టెంపరేచర్ సెన్సార్, ఒవులేషన్ ఎస్టిమేషన్, పలు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్, నాయిస్ మోనిటరింగ్ బ్యాక్ ట్రాక్, కార్డియో ఫిట్ నెస్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మహిళలకు రుతుక్రమ ట్రాకింగ్, క్రాష్ డిటెక్షన్ వంటి అందుబాటులో ఉంటాయి. దీని ధర రూ. 45,900 నుంచి ప్రారంభమవుతుంది.

యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో.. దీనిలో కొత్త తరం హెచ్2 ప్రాసెసర్‌ ఉంటుంది. ఇది అసాధారణమైన ధ్వని అనుభవాన్ని అందిస్తుంది. ఇది మునుపటి తరం ఎయిర్ పాడ్స్ ప్రో కంటే రెండు రెట్లు ఎక్కువ నాయిస్ ను తగ్గించగలుగుతుంది. రిచ్ బేస్, క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్లారిటీని అందిస్తుంది. 30 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. దీని ధర రూ. 26,900 నుంచి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 సిరీస్.. ఇటీవల సిరీస్ వాచ్ లను శామ్సంగ్ విడుదల చేసింది. వాచ్6, వాచ్ 6 క్లాసిస్ పేరిట వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ లలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. సప్ఫైర్ క్రిస్టల్ ప్రోటెక్టెడ్ సూపర్ అమోల్డ్ ప్యానల్స్ ఉంటాయి. ఆల్వేస్ ఆన్ మోడ్ ఉంటుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఉంటుంది. గూగుల్ వేర్ ఓఎస్ 4.0 ఆధారంగా పనిచేస్తుంది. 40 గంటల బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. దీనిలో బయో యాక్టివ్ సెన్సార్ ఉంటుంది. దీని సాయంతో ఆప్టికల్ హార్ట్ రేట్, ఎలక్ట్రిక్ హార్ట్ సిగ్నల్, బయో ఎలక్ట్రికల్ ఇమ్పెడెన్స్ అనాలసిస్ తెలుసుకోవచ్చు. అలాగే టెంపరేచర్ సెన్సార్, యాక్సెలోమీటర్, బారోమీటర్, గైరరో సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 26,999 నుంచి ప్రారంభమవుతుంది.

శామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో2.. ఇది సరికొత్త డిజైన్లో మార్కెట్లోకి వచ్చింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ఏఎన్సీ)టెక్నాలజీతో వస్తోంది. 360 డిగ్రీల ఆడియో ట్యూన్డ్ ఏకేజీ, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్స్ తో హైఫై సౌండ్ క్లారిటీని అందిస్తుంది. దీని ధర రూ. 16,990గా ఉంది.

గార్మిన్ వివోమూవ్ స్పోర్ట్.. ఈ స్మార్ట్ వాచ్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. మెటాలిక్ కలర్డ్ డయల్, సిలికాన్ బ్యాండ్ ఉంటుంది. హిడెన్ డిస్ ప్లే ఉంటుంది. వినియోగదారులకు అవసరమైనప్పుడు మాత్రమే టచ్ స్క్రీన్ ను ఓపెన్ చేసుకొన కాల్స్, నోటిఫికేషన్లు చూసుకోవచ్చు. దీనిలో హార్ట్ రేట్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్లీప్ ప్యాటర్న్, ఫిజికల్ యాక్టివిటీ, రెస్పిరేటరీ ట్రాకింగ్, స్ట్రెస్ మోనిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 18,990 నుంచి ప్రారంభమవుతుంది.

ఇవేకాక సోనీ డబ్ల్యూఎఫ్-సీ700ఎన్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, రెడ్ మీ వాచ్ 3 యాక్టివ్ స్మార్ట్ వాచ్, వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ జెడ్2 ఏఎన్సీ ఇయర్ ఫోన్స్, రెడ్ మీ బడ్స్ 4 యాక్టివ్ ఇయర్ ఫోన్స్, వంటివి కూడా బెస్ట్ ఆప్షన్లే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..