AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Danger to Earth: కరోనా మూడో వేవ్ కంటే వేగంగా ముంచుకొస్తున్న పెద్ద ముప్పు.. కలవరపాటులో శాస్త్రవేత్తలు!

కరోనాను మించి వేగంగా దూసుకువస్తున్న సరికొత్త ప్రమాదం నాసా శాస్త్రవేత్తలను భయపెడుతోంది. ఈ నెలలోనే ఈ ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని నాసా అంటోంది.

Danger to Earth: కరోనా మూడో వేవ్ కంటే వేగంగా ముంచుకొస్తున్న పెద్ద ముప్పు.. కలవరపాటులో శాస్త్రవేత్తలు!
Danger To Earth
KVD Varma
|

Updated on: Jan 05, 2022 | 8:21 PM

Share

Danger to Earth: ఓ భారీ గ్రహశకలం భూమి వైపునకు దూసుకొస్తోంది. ఇదిప్పుడు కరోనా కంటే ఎక్కువగా శాస్త్రవేత్తలను భయపెడుతోంది.. ఈ గ్రహ శకలం సైజులో అత్యంత భారీ పరిమాణంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, దాని వేగం కూడా ఇదివరకటి అస్టరాయిడ్లతో పోల్చుకుంటే.. రెట్టింపు ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా ‘ చెబుతోంది. కొద్ది రోజుల్లో ఈ గ్రహశకలం భూకక్ష్యలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ గ్రహశకలం పరిమాణం సుమారు 3,280 అడుగులుగా ఉందని అంచనా వేస్తున్నారు.

భారీ గ్రహశకలం..

న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తు దాని అంచు వరకూ లెక్కస్తే 443 మీటర్లు. తాజగా భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం న్యూయార్క్‌ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే రెండున్నర రెట్లు పెద్దది. కాలిఫోర్నియాలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ సైజు ( 2,737 మీటర్లు పొడవు) కంటే పెద్దగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఈ గ్రహశకలాన్ని 7482 (1994పీసీ1) అనే నెంబరుతో పిలుస్తున్నారు

నిజానికి ఈ గ్రహశకలం ఇప్పటిది కాదు. దీనిని 1994లో మొదట గుర్తించారు. 1994 ఆగస్టు 9న ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీ సైంటిస్ట్ రాబర్ట్ మెక్‌నాట్ దీన్ని కనుగొన్నారు.భవిష్యత్తులో ఇది భూమికి అత్యంత సమీపానికి వస్తుందంటూ అప్పట్లో రాబర్ట్ మెక్‌నాట్ అంచనా వేశారు. ఆ అంచనా ఇప్పడు వాస్తవ రూపం దాల్చుతోంది.

వేగం.. ప్రమాదం..

ఈ గ్రహశకలం వేగం సెకనుకు 19.56 కిలోమీటర్లు. అంటే కన్నుమూసి తెరిచే లోపలే మాయం అయ్యేంత వేగంతో ఇది ప్రయాణిస్తోంది. గంటకు 43,754 మైళ్లతో భూకక్ష్య వైపునకు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన ఈస్టర్న్ టైమ్ జోన్ (ఈఎస్టీ) ప్రకారం సాయంత్రం 4:51 నిమిషాలు, కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ జోన్ ప్రకారం.. ఉదయం 9:23 నిమిషాలకు ఈ అస్టరాయిడ్ భూమికి అత్యంత సమీపానికి చేరుకుంటుందని, అదే వేగంతో విశ్వాంతరాల్లోకి దూసుకెళ్తుందని పేర్కొన్నారు.

భూమిని తాకదు.. కానీ..

అత్యంత సమీపానికి వచ్చినప్పుడు భూమికి, ఈ గ్రహశకలానికి మధ్య ఉండే దూరం 1.2 మిలియన్ మైళ్ళు ఉంటుంది. ఇది భూమికి-చంద్రుడికి మధ్య ఉన్న దూరంతో పోల్చుకుంటే 5.5 రెట్లు ఎక్కువ. దీనివల్ల భూమికి వచ్చే ప్రమాదం ఏదీ లేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, దాని ప్రభావం వల్ల శాటిలైట్ నెట్‌వర్క్స్ ప్రభావితమౌతాయని అంచనా వేస్తున్నారు.

మరికొన్ని అస్టరాయిడ్లు కూడా వస్తున్నాయి..

అదొక్కటే కాకుండా.. మరిన్ని అస్టరాయిడ్లు ఈ నెలలోనే భూకక్ష్యను సమీపిస్తాయని నాసా అంటోంది. ఏడు మీటర్ల వ్యాసం గల 2014 వైఈ15 తోకచుక్క ఈ జనవరి 6 నాడు భూమికి 4.6 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్తుంది. నాలుగు మీటర్ల పొడవు ఉండే 2020 ఎపీ1 గ్రహశకలం జనవరి 7న భూమికి 1.08 మిలియన్ మైళ్ల దూరం నుంచి దూసుకెళ్తుంది. 2013 వైడీ48 అనే మరో అస్టరాయిడ్.. భూమికి 3.48 మిలియన్ మైళ్ల దూరం నుంచి ప్రయాణిస్తుంది.

గ్రహశకలాలు అంటే?

గ్రహశకలాలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న, రాతి వస్తువులు. ఇవి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. అయితే గ్రహాల కంటే చాలా చిన్నవి. వీటిలో వందల మైళ్ల నుంచి అనేక అడుగుల పరిమాణం వరకూ లక్షలాది గ్రహ శకలాలు ఉన్నాయి. గ్రహశకలాల వార్తల గురించి మనం పెద్దగా పట్టించుకోం విశ్వం ఆవిర్భావం, డైనోసార్ల శకం ముగియడం వంటి ఎన్నో పరిణామాలకు ఆస్టరాయిడ్స్‌కు లింకుంది. ఏ గ్రహశకలం ఎలాంటి ముప్పు తెస్తుందో చెప్పలేం అందువల్ల దూసుకొచ్చే ప్రతీ శకలాన్ని నిశితంగా ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. మొన్న జూలై 24న కూడా “2008 గో20” అనే గ్రహ శకలం కూడా భూమికి చేరువగా వచ్చింది. గతేడాది కూడా రెండు సార్లు గ్రహ శకలాలు భూమికి చేరువగా వచ్చి వెళ్ళాయి. భవిష్యత్తులో భారీ గ్రహశకలాలు భూ గ్రహాన్ని ఢీకొట్టే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

భూమికి గ్రహ శకలాల గండం..

సౌర వ్యవస్థలో గ్రహ శకలాల వయసును 4.6 బిలియన్‌ సంవత్సరాలుగా భావిస్తుంటారు. సౌర కుంటుంబంలో లక్షలాది గ్రహశకలాలున్నాయి. ఇప్పటివరకూ మొత్తం 26 వేల ఆస్టరాయిడ్స్‌ను నాసా గుర్తించింది. ఇందులో వెయ్యి గ్రహశకలాలను మాత్రం భూమికి ప్రమాదకరమైన వాటిగా గుర్తించింది ఆస్టరాయిడ్స్ అవి వెళ్లే దారిలో మరేదైనా గ్రహశకలం వాటిని ఢీకొంటే వాటి కక్ష్య మారిపోతుంది.

ప్రమాదం నివారించే ప్రయోగాలు?

గ్రహశకలాలు భూమివైపునకు రావడం వల్ల వచ్చే ప్రమాదాల నివారణకు అమెరికా, చైనా కసరత్తు చేస్తున్నాయి. గ్రహశకలంపై రాకెట్లను ప్రయోగించి శకలం దారి మరల్చే ప్రయత్నం చేయవచ్చని ఆలోచన చేస్తున్నాయి. ఇలాంటి గ్రహశకలాల్ని గమనించేందుకు నాసా దగ్గర ప్లానెటరీ డిఫెన్స్ సిస్టం ఉంది. త్వరలో నాసా… డబుల్ ఆస్టరాయడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) మిషన్‌ను పంపబోతోంది. ఈ మిషన్ వేగంగా దూసుకెళ్లి 780 మీటర్ల సైజు ఉన్న ఆస్టరాయిడ్ డిడిమోస్ (Didymos)ను ఢీకొట్టనుంది. భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం భూమివైపు వస్తూ ఉంటే అది రాకముందే దాన్ని పేల్చేయాలన్నది నాసా ప్లాన్. అందులో ఇది తొలి ప్రయోగం. ఈ సంవత్సరం అక్టోబర్‌లో ఈ విధ్వంస ప్రయోగం జరగనుందని అంచనా వేస్తున్నారు. చైనా కూడా ఇటువంటి ప్రయోగంపైనే పరిశోధనలు చేస్తోంది.

అమెరికా డార్ట్ మిషన్ విజయవంతం అయితే.. భూమి గ్రహశకలాల ముప్పు నుంచి కొంతవరకూ బయటపడినట్లు అవుతుంది. 6.6 కోట్ల సంవత్సరాల కిందట కొన్ని కిలోమీటర్ల సైజు ఉన్న ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టడందాని వల్ల భూమిపై ఉన్న జీవుల్లో మూడోవంతు అంతరించిపోయాయని ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం రాక్షస బల్లులు కూడా దాని వల్లే అంతరించిపోయాయని ఓ అంచనా ఉంది.

ఇవి కూడా చదవండి: Viral Photo: చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!

Muthoot Finance: ముత్తూట్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ సేవలు బంద్‌..!