Iphone Auction: వేలంలో రికార్డు సృ​ష్టించిన ఐఫోన్‌ ఫస్ట్‌ ఎడిషన్‌.. ఎంత ధర పలికిందో? తెలిస్తే షాకవుతారు

తాజాగా 2007 ఐఫోన్‌ మోడల్‌ను వేలం వేయగా ఏకంగా రూ.1.5 కోట్లు పలికిందనే వార్త హల్‌చల్‌ చేస్తుంది. సాధారణంగా యాపిల్‌ ఫోన్ల ధరలు ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల యాపిల్‌ ఫస్ట్‌ ఎడిషన్లను వేలం వేస్తున్నారు. ఈ వేలంలో 2007 ఐ ఫోన్‌ ఫస్ట్‌ ఎడిషన్‌ రికార్డు ధర పలికింది. ఈ వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

Iphone Auction: వేలంలో రికార్డు సృ​ష్టించిన ఐఫోన్‌ ఫస్ట్‌ ఎడిషన్‌.. ఎంత ధర పలికిందో? తెలిస్తే షాకవుతారు
I Phone

Updated on: Jul 18, 2023 | 10:45 PM

ప్రపంచ మొబైల్‌ చరిత్రలో యాపిల్‌ ఫోన్లకు ఉండే క్రేజ్‌ వేరు. అందులోని సెక్యూరిటీ ఫీచర్లతో పాటు డిజైన్‌, ప్రాసెసర్‌, కెమెరా వంటి అద్భుత ప్రదర్శనను కనబరుస్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు కచ్చితంగా ఐఫోన్‌ వాడతారు. అయితే ఇటీవల కాలంలో యాపిల్‌ కంపెనీ మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా కొన్ని మోడల్స్‌ ఫోన్లను రిలీజ్‌ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా 2007 ఐఫోన్‌ మోడల్‌ను వేలం వేయగా ఏకంగా రూ.1.5 కోట్లు పలికిందనే వార్త హల్‌చల్‌ చేస్తుంది. సాధారణంగా యాపిల్‌ ఫోన్ల ధరలు ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల యాపిల్‌ ఫస్ట్‌ ఎడిషన్లను వేలం వేస్తున్నారు. ఈ వేలంలో 2007 ఐ ఫోన్‌ ఫస్ట్‌ ఎడిషన్‌ రికార్డు ధర పలికింది. ఈ వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

ఈ ఐఫోన్‌ ఫ్యాక్టరీ-సీల్డ్ మొదటి ఎడిషన్‌గా ఉంది. అంటే ఈ ఫోన్‌ 2007లో తయారుచేసిన 4 జీబీ మోడల్‌. ఈ ఫోన్‌ను ఎల్‌సీజీ వేలంలో రూ.1.5 కోట్లకు ఓ ఔత్సాహికుడు దక్కించుకున్నాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ఐఫోన్‌ ప్రారంభ వెర్షన్‌ అయినప్పటికీ 4 జీబీ మోడల్‌ అని తెలుస్తుంది. అయితే ఈ ఫోన​ ఇప్పటికీ సీల్డ్‌ పీస్‌ అని అందువల్ల అంత రేట్‌ పలికిందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 

నివేదికల ప్రకారం ఈ ప్రత్యేక ఐఫోన్‌ను 2007లో దివంగత యాపిల్‌ సీఈఓ స్టీవ్ జాబ్స్ ప్రవేశపెట్టారు. ప్రారంభంలో నెమ్మదిగా సాగిన అమ్మకాలను ఎదుర్కొన్నారు. యాపిల్‌ ప్రారంభించిన రెండు నెలల తర్వాత 4 జీబీ మోడల్‌ను నిలిపివేసింది. మ్యాక్‌ వరల్డ్‌ 2007లో కీలక ప్రసంగం సందర్భంగా జాబ్స్ విప్లవాత్మక పరికరాన్ని ఆవిష్కరించారు. విడుదల సమయంలో 4 జీబీ మోడల్ ధర 500 డాలర్లు కాగా, 8 జీబీ మోడల్ 600 డాలర్లకు అందుబాటులో ఉంది. కేవలం 100 డాలర్లకు ఇంకో 4 జీబీ అదనంగా రావడంతో కొనుగోలుదారులు 8 జీబీ మోడల్‌ కొనుగోలుకు ఆసక్తి చూపారు. అప్పటి నుంచి కంపెనీ రూపొందించిన 4 జీబీ మోడల్స్‌ను హోలీ గ్రెయిల్‌ పరిగణిస్తుననారు. పరిమిత సంఖ్యలో ఉన్న ఈ ఫోన్లను వేలం ద్వారా ఔత్సాహికులు దక్కించుకుంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..