AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Galaxy M34 5G: సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫోన్‌.. రూ. 15 వేలలో 50 ఎంపీ కెమెరా, 5జీ ఫోన్

సౌత్‌ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. సామ్‌సంగ్‌ ఎమ్‌ 34 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ఫోన్‌లో మంచి ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ఫోన్‌ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం...

Narender Vaitla
|

Updated on: Jul 18, 2023 | 7:00 PM

Share
ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ సామ్‌సంగ్‌ కొత్త స్మార్ట్ ఫోన్‌ లాంచ్‌ చేసింది. ప్రస్తుతం భారత్‌లో అమెజాన్‌తో పాటు సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌34 పేరుతో తీసుకొచ్చారు.

1 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరియంట్ ధర రూ. 16,999 కాగా, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 18,999గా ఉంది. ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో రూ. 2000 వరకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1080 x 2340 పిక్సెల్‌ డిస్‌ప్లే ఈ స్క్రీన్‌ ప్రత్యేకగా చెప్పొచ్చు.

3 / 5
Exynos 1280 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇక సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5