AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIకు ‘ప్లీజ్’, ‘థాంక్యూ’ అవసరమా? మర్యాద ఇస్తే ఇచ్చే AI ఎలా స్పందిస్తుందో తెలుసా

చాట్‌జీపీటీ, జెమిని, క్లాడ్ వంటి ఏఐ బాట్లను వాడుతున్నప్పుడు మనం ఎంతో మర్యాదగా “ప్లీజ్”, “థాంక్యూ”, “ఇఫ్ యు డోంట్ మైండ్” అంటూ టైప్ చేస్తుంటాం. ఇది మానవ సహజ స్వభావం కావచ్చు కానీ, టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది వృథా ప్రయాస మాత్రమే. ఏఐ మోడల్స్ అనేవి స్పృహ గల జీవులు కావు, కేవలం డేటా ఆధారంగా పని చేసే యంత్రాలు. కాబట్టి వీటిని మనం అడిగే తీరుపై ఏఐకి ప్రత్యేకమైన భావోద్వేగాలు ఉండవు.

AIకు 'ప్లీజ్', 'థాంక్యూ' అవసరమా? మర్యాద ఇస్తే ఇచ్చే AI ఎలా స్పందిస్తుందో తెలుసా
Ai Manners Debate.jpg
Nikhil
|

Updated on: Jun 15, 2026 | 10:01 PM

Share

ఏఐ బాట్ల వాడకానికి సంబంధించిన తాజా పరిశోధనలను గమనిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలామంది ఏఐతో మర్యాదగా మాట్లాడితే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తారు. అయితే కొన్ని అధ్యయనాలు మాత్రం విభిన్నమైన ఫలితాలను చూపించాయి. మరీ అతిగా మర్యాదలు ప్రదర్శిస్తే ఏఐ మోడల్స్ అనవసరమైన సమాచారాన్ని (Fluff) జోడించి సమాధానాన్ని సుదీర్ఘంగా మారుస్తాయని తేలింది. మరికొన్ని పరిశోధనల్లో, మరీ పొలైట్‌గా అడగడం కంటే.. సూటిగా, స్పష్టంగా అడిగినప్పుడు ఏఐ కచ్చితమైన సమాధానాలను ఇస్తుందని వెల్లడైంది. అయితే ఇది పూర్తిగా మీరు ఉపయోగించే ఏఐ మోడల్ మరియు మీరు అడిగే ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది.

కోపం వద్దు.. స్పష్టత ముద్దు!

మర్యాద చూపించకపోయినా ఫర్వాలేదు కానీ, కోపంతో లేదా ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడటం మాత్రం అస్సలు మంచిది కాదు. కఠినమైన లేదా కోపంతో కూడిన ప్రాంప్ట్స్ ఇచ్చినప్పుడు ఏఐ తన పనితీరును మార్చుకోవచ్చు. దీనివల్ల సమాధానాల నాణ్యత తగ్గడం, అసంబద్ధమైన సమాచారం రావడం లేదా ఏఐ రక్షణ కవచాలు (Guardrails) యాక్టివేట్ అయ్యి సమాధానాన్ని నిలిపివేయడం వంటివి జరగవచ్చు. ఏఐకి భావోద్వేగాలు లేవు, కానీ అది నేర్చుకున్న డేటా సెట్‌లో మర్యాదపూర్వకమైన సంభాషణలే అధిక నాణ్యత కలిగి ఉండటం వల్ల, మర్యాదగా అడగడం వల్ల సమాధానం బాగుంటుందని కొంతమంది నిపుణుల వాదన.

బెస్ట్ రిజల్ట్స్ కోసం..

మీరు ఏఐ నుండి ఉత్తమమైన ఫలితాలను పొందాలనుకుంటే..

  •  స్పష్టత (Clarity): మీకు ఏం కావాలో సూటిగా చెప్పండి.
  • ప్రసంగం (Context): సందర్భాన్ని వివరిస్తూ అడగండి.
  • తటస్థత (Neutral Tone): భావోద్వేగాలకు తావులేకుండా, ప్రొఫెషనల్‌గా అడగడం అన్నింటికన్నా ఉత్తమం.

మీరు ఏఐతో మర్యాదగా ప్రవర్తించడం వల్ల దానికి ఏమీ తెలియకపోవచ్చు, కానీ మీ వ్యక్తిత్వానికి, మీ అలవాట్లకు అది మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మీరు అదే మర్యాదను పాటిస్తారు. కాబట్టి ఏఐతో మాట్లాడేటప్పుడు కూడా ఒక పద్ధతిని అనుసరించడం మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని మెరునగుపరుస్తుంది.

ఏఐని ఒక పనిముట్టుగా మాత్రమే భావించి, క్లారిటీతో ప్రాంప్ట్స్ ఇవ్వడం ద్వారా తక్కువ సమయంలో మెరుగైన ఫలితాలను సొంతం చేసుకోండి. సమయాన్ని వృథా చేయకుండా, లాజికల్‌గా ఆలోచించి ఏఐని ఉపయోగించడం నేటి స్మార్ట్ వినియోగదారుల లక్షణం.

Follow Us