Tesla phone rumours: అంగారక గ్రహంపైనా పనిచేసే టెక్నాలజీతో టెస్లా ఫోన్.. ఎలన్ మస్క్ ఏమన్నారంటే?
నిత్యం ఇంటర్నెట్ లో అనేక పుకార్లు షికార్లు చేస్తుంటాయి. వాటిని చూసిన వెంటనే ప్రజలు నవ్వుకుని వదిలేస్తారు. కానీ కొన్ని మాత్రం ఆలోచనను రేకిస్తాయి. అవి నిజమైతే బాగుంటుందని కోరుకునేలా చేస్తాయి. అలాంటి ఓ విషయం ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. త్వరలో టెస్లా ఫోన్ విడుదల అవుతుందని, దానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని దాని సారాంశం.

ఎలోన్ మస్క్ కి చెందిన టెస్లా కంపెనీ నుంచి విడుదలయ్యే ఫోన్ కు మోడల్ పై అని నామకరణం కూడా చేశారు. దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. కానీ ఆ కంపెనీ నుంచి మాత్రం అనధికార ప్రకటన విడుదల కాలేదు. టెస్లా విడుదల చేయనున్న వంద డాలర్ల ఫోన్ ఇదేనంటూ ఇటీవల యూట్యూబ్, టిక్ టాక్ లో వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ నిజమైనవి అనడానికి ఎలాంటి ఆధారాలులేవు. కానీ ఈ వార్త టెక్నాలజీ ప్రపంచంలో ప్రకంపనలు రేపుతోంది. ఎలోన్ మాస్క్ కు చెందిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తోంది. దాని నుంచి విడుదలయ్యే ఫోన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచ కుబేరుడు అయిన ఎలోన్ మస్క్ ఎల్లప్పుడు వార్తల్లో ఉంటారు. ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమే. ఆయన కంపెనీ టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెస్లా స్మార్ట్ ఫోన్ వార్త కూ కూడా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టెస్లా స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తున్నట్టు గతంలోనూ అనేక పుకార్లు వచ్చాయి. వాటినన్నింటినీ ఎలోన్ మస్క్ ఖండించారు. కానీ కొందరు మాత్రం టస్లా ఫొన్ త్వరలో విడుదల అవుతుందని కరాఖండిగా చెబుతున్నారు. టెస్లా కంపెనీ విడుదల చేసే ఫోన్లలో ఉండే ఫీచర్లు ఇవే నంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా ఊహాగానాలు అయినప్పటికీ ఆ వార్తల్లో తెలిపిన ఫీచర్ల గురించి తెలుసుకుందాం. వాటిలో ముఖ్యమైనది టెస్లా ఫోన్ ను విద్యుత్ అవసరం లేకుండానే సౌరశక్తి తో చార్జింగ్ చేసుకునే వీలుందంట. ఎలోన్ మస్క్ పర్యావరణం కోసం ఎప్పుడు ఆలోచిస్తారు. ఆయన ఆలోచనలకు సౌరశక్తి తో చార్జింగ్ అనే ఫీచర్ సరిగ్గా సరిపోతుంది.
ఇప్పటికే టెస్లా కంపెనీ సోలార్ టెక్నాలజీని బాగా వినియోగించుకుంటోంది. మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ అనే కంపెనీ అందించిన స్టార్ లింక్ ను మోడల్ పై ఫోన్ లో వినియోగించారు. ఉపగ్రహ ఆధారంగా వేగంగా పనిచేసే బ్రాడ్ బ్రాండ్ ఇంది. 5జీ నెట్ వర్క్ లేని ప్రాంతాలలో కూడా ఈ ఫోన్ కవరేజీ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ లింగ్ టెక్నాలజీ చాలా ఆధునికంగా ఉంటుందని తెలుస్తోంది. మోడల్ పై ఫోన్ లో బ్రెయిన్ – మెషీన్ – ఇంటర్ ఫేస్ (బీఎంఐ) చిప్ లు ఉంటాయని భావిస్తున్నారు. అంటే మన ఆలోచనలతో పరికరాలను నియంత్రించే వీలుంటుంది. ముఖ్యంగా అంగారక గ్రహంపై కూడా ఫోన్ చేసే టెక్నాలజీ ఉంది. ఈ ఫోన్ ధర దాదాపు 100 డాలర్లు ఉంటుందని సమాచారం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..








