AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tesla smartphone: మరోసారి తెరపైకి టెస్లా స్మార్ట్‌ఫోన్‌.. డిసెంబర్‌లోనే లాంచ్‌, ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే..

ఎలాన్‌ మస్క్‌.. ప్రపంచానికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచకుబేరుడిగానే కాకుండా గొప్ప వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మస్క్ ఏది చేసినా సంచలనమే...

Tesla smartphone: మరోసారి తెరపైకి టెస్లా స్మార్ట్‌ఫోన్‌.. డిసెంబర్‌లోనే లాంచ్‌, ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే..
Tesla Smartphone
Narender Vaitla
|

Updated on: Oct 18, 2022 | 6:20 AM

Share

ఎలాన్‌ మస్క్‌.. ప్రపంచానికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచకుబేరుడిగానే కాకుండా గొప్ప వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మస్క్ ఏది చేసినా సంచలనమే. ఇప్పటికే పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన మస్క్‌.. తాజాగా స్మార్ట్‌ఫోన్‌ రంగంలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టెస్లా కంపెనీ నుంచి స్మార్ట్‌ ఫోన్‌ వస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి టెస్లా స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్‌ను వచ్చే డిసెంబర్‌లో లాంచ్‌ చేయనున్నారని సమాచారం. ఇంతకీ టెస్లా నుంచి వచ్చే ఫోన్‌ పేరు ఏంటి? ఫీచర్లు ఎలా ఉండనున్నాయి లాంటి వివరాలు మీకోసం. టెస్లా కంపెనీకి చెందిన ఈ ఫోన్‌ను పైఫోన్‌ పేరుతో లాంచ్‌ చేయనున్నారు. తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇస్తున్నారు. దీనికి ఒలియోఫోబిక్‌ కోటింగ్‌తో స్క్రాచ్‌ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలు ఉండనున్నాయి.

వెనకాల వైపు మూడు 50 ఎంపీ కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ముందుభాగంలో 40 ఎంపీ పంచ్‌హోల్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండనున్న ఈఫోన్‌ ధర రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు ఉండొచ్చని అంచనా. ఇక టెస్లా ఇందుకోసం ప్రత్యేకంగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకొస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!