Tesla Cybercab: టెస్లా రోబో ట్యాక్సీ ఇది.. స్టీరింగ్ లేదు.. డ్రైవర్ అవసరమే రాదు..
టెస్లా రోబో ట్యాక్సీ పూర్తిగా ఆటోమేటిక్. దీనిని నడపడానికి డ్రైవర్ అవసరం లేదు. అసలు ఈ కారుకు స్టీరింగే ఉండదు. కారులో చిన్న క్యాబిన్ మాత్రమే ఉంటుంది. ఫుల్లీ ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పనిచేస్తుంది. యాక్సలరేటర్, బ్రేక్ పెడల్స్ ఏమీ ఉండవు. ఇందులో కొన్ని సెన్సార్లు, కెమెరాలు ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా..
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంచలనం సృష్టించారు. ఇప్పటికే డ్రైవర్ లెస్ కార్లను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకొచ్చిన సత్తా చాటిన ఆయన.. ఇప్పుడు ఏకంగా ఫుల్లీ ఆటోమేటెడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే కారు.. అంటే రోబో కారును ప్రపంచానికి పరిచయం చేశారు. దాని పేరు టెస్లా సైబర్ క్యాబ్. దీనికి డ్రైవర్ అవసరం లేదు. ఎటువంటి స్టీరింగ్ వీల్ ఉండదు. బ్రేకులు, యాక్సెలరేటర్ వంటి వాటి కోసం పెడల్స్ కనిపించవు.. ఇక గేర్ బాక్స్ కూడా ఉండదు. మొత్తం రోబో ద్వారానే ఈ కారు నడుస్తుంది. ఈ రోబో ట్యాక్సీలో ఎలాన్ మస్క్ ప్రయాణిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. దానికి సంబంధించిన వీడియోను సైతం షేర్ చేశారు. దీనిలో ఫంక్షన్లు అన్నీ ఆటోమేటిక్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రోబో ఈవెంట్లో లాంచ్..
ఇటీవల లాస్ ఏంజెన్స్ లో వీ, రోబోట్ ఈవెంట్లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ రోబోట్ ట్యాక్సీ సైబర్ క్యాబ్ ను ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ప్రకటన చాలా కాలం క్రితమే ఎలాన్ మస్క్ చేశారు. దీంతో ఎంతో కాలంగా ప్రపంచం దీనికి ఎదురుచూస్తోంది. కాగా ఈ కారు తయారీ 2026లో ప్రారంభమవుతుందని మస్క్ ప్రకటించారు. కాగా దీని పనితీరు ఎలా ఉంటుంది అనే విషయంపై మస్క్ ఓ షార్ట్ వీడియో కూడా విడుదల చేశారు. రోబో ట్యాక్సీతో పాటు రోబో బస్ ను కూడా ఆవిష్కరించారు. దీనిలో 200 మంది ప్రయాణించొచ్చు. దీనిని స్కూల్ బస్సుగా కూడా ఉపయోగించుకోవచ్చని మస్క్ ప్రకటించారు.
టెస్లా సైబర్ క్యాబ్ ఎలా పనిచేస్తుందంటే..
టెస్లా రోబో ట్యాక్సీ పూర్తిగా ఆటోమేటిక్. దీనిని నడపడానికి డ్రైవర్ అవసరం లేదు. అసలు ఈ కారుకు స్టీరింగే ఉండదు. కారులో చిన్న క్యాబిన్ మాత్రమే ఉంటుంది. ఫుల్లీ ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పనిచేస్తుంది. యాక్సలరేటర్, బ్రేక్ పెడల్స్ ఏమీ ఉండవు. ఇందులో కొన్ని సెన్సార్లు, కెమెరాలు ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా.. కారు ప్యానల్లో డెస్టినేషన్ అంటే మీరు వెళ్లాల్సిన ప్రాంతాన్ని ఎంటర్ చేస్తే చాలు.. గమ్యానికి చేరుస్తుంది. ఇద్దరు కూర్చొని ప్రయాణించొచ్చు. ఈ కారు చాలా ఫ్యూచరిస్టిక్ గా డిజైన్ చేశారు. భవిష్యత్తులో వాహనాలు ఎలా ఉంటాయో ఆ విధంగానే వీటిని రూపొందించారు. ప్రస్తుతానికి ఈ రోబో ట్యాక్సీ ప్రోటో టైప్ మాత్రమే లాంచ్ అయ్యింది. దీనిని మీ మొబైల్ ఫోన్ లాగానే వైర్ లెస్ చార్జర్ తో చార్జ్ చేయొచ్చు.
టెస్లా సైబర్ క్యాబ్ ఫీచర్లు ఇవి..
రోబో ట్యాక్సీలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ లెవల్ 2 ఫీచర్ ను కూడా ఇందులో అందుబాటులో ఉంచారు. ఈ కారు రెండు డోర్లతో వస్తుంది. బటర్ ఫ్లై తరహా డోర్ల డిజూన్ ను ఇందులో అందించారు. పెద్ద టచ్ స్క్రీన్ డిస్ ప్లే సెంటర్ కన్సోల్ ను అందించారు. వాస్తవానికి అన్ని టెస్లా వాహనాల్లోనూ ఇది డీఫాల్ట్ గా ఉంటుంది. సైబర్ ట్రక్ లో కూడా డీఫాల్ట్ గా దీనిని గమనించవచ్చు. లోపల ఇంటీరియర్ డిజైన్ క్లాసీగా, సింపుల్ గా ఉంటుంది. సెంట్రల్ కన్సోల్ లో కూడా బటన్స్ అస్సలు లేవు. ఎక్స్ టీరియర్ మాత్రం టెస్లా సైబర్ ట్రక్ మాదిరిగానే ఉంటుంది.
ధర ఎంతంటే..
టెస్లా సీఈఓ మస్క్ ఆవిష్కరించిన సైబర్ క్యాబ్ ధర కూడా చాలా తక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం 30వేల డాలర్లు(మన కరెన్సీలో రూ. 25లక్షలు) లోపు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ కారు ఉత్పత్తి 2026 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎలాన్ మస్క్ సూచన ప్రాయంగా తెలిపారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..