Sahara Desert: సహారా ఎడారిలో భారీ వర్షాలు, వరదలు..! ఇది దేనికి సంకేతం..?

Sahara Desert Floods: ప్రపంచంలో వైశాల్యంలోనే అతి పెద్ద ఎడారి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా పేరొందిన సహారా ఎడారిలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. ఏడాది మొత్తమ్మీద సగటున 5 మి.మీ వర్షపాతం కూడా నమోదుకాని ఈ ఎడారిలో భారీ వర్షాలు సంభవించడమే ఒక వింత కాగా, వరదలు సంభవించే స్థాయిలో వర్షపాతం నమోదు కావడం వాతావరణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. గత 50 ఏళ్ల కాలంలో మునుపెన్నడూ లేని స్థాయిలో సహాయ ఎడారిలో వర్షాలు కురిసాయి. ఈ అరుదైన వర్షాలు, వరదలు భూగోళంపై సంభవించే మరిన్ని భారీ విపత్తులకు సంకేతంగా వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sahara Desert: సహారా ఎడారిలో భారీ వర్షాలు, వరదలు..! ఇది దేనికి సంకేతం..?
Sahara Desert FloodsImage Credit source: Twitter
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 15, 2024 | 3:56 PM

తుఫాన్లు, భారత్ వంటి దేశాల్లో రుతుపవనాలు వర్షాలను తెచ్చిపెడుతుంటాయి. వర్షాలకు మరికొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కూడా కారణమవుతుంటాయి. కారణమేదైనా సరే.. తరచుగా వర్షాలు కురిసే ప్రాంతాల్లో అధిక మొత్తంలో వర్షపాతం నమోదైతే వరదలు కూడా సంభవిస్తుంటాయి. ఇది సహజసిద్ధ వాతావరణ పరిస్థితే. కానీ ఎప్పుడూ వర్షమే కురియని ఎడారి నేలపై వరదలు సంభవిస్తే..? ఇది కచ్చితంగా ఓ ప్రమాద సంకేతమే. ప్రస్తుతం భూగోళంపై అదే జరుగుతోంది. మానవ తప్పిదాల కారణంగా పెరుగుతున్న ‘భూతాపం’ (Global Warming) అనేక ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతోంది. గతంలో ఎప్పుడూ చూడని తీవ్రత కల్గిన తుఫాన్లు, అతి తక్కువ వ్యవధిలో అత్యధిక వర్షపాతం, ఆకస్మిక వరదలు, టోర్నడో వంటి సుడిగాలుల బీభత్సాలు.. ఇలా ఒకటేమిటి అనేక రకాల సహజసిద్ధ ప్రకృతి వైపరీత్యాల సంఖ్య పెరుగుతోంది. వాటి తీవ్రత కూడా నానాటికీ పెరుగుతోంది. అంతేకాదు, దశాబ్దాలుగా వర్షాలే కురవని ఎడారుల్లో భారీ వర్షాలు కురిసి వరదలు సంభవిస్తున్నాయి. నిత్యం వర్షం కురిసే రెయిన్ ఫారెస్ట్‌లలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. లక్షల ఎకరాల్లో అడవులు దావాగ్నిలో కాలి బూడిదైపోతున్నాయి. తాజాగా ప్రపంచంలో వైశాల్యంలోనే అతి పెద్ద ఎడారి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా పేరొందిన సహారా ఎడారిలో వరదలు సంభవించాయి. ఏడాది మొత్తమ్మీద సగటున 5 మి.మీ వర్షపాతం కూడా నమోదుకాని ఈ ఎడారిలో భారీ వర్షాలు సంభవించడమే ఒక వింత కాగా, వరదలు సంభవించే స్థాయిలో వర్షపాతం నమోదు కావడం వాతావరణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనను భూగోళంపై సంభవించే మరిన్ని భారీ విపత్తులకు సంకేతంగా వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సహజ మార్పులా.. మానవ తప్పిదాలా?

ఆఫ్రికా ఖండంలో అనేక దేశాల్లో విస్తరించిన సహారా ఎడారి భూగోళంపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా పేరుగాంచింది. బలమైన గాలులు, పూర్తిగా పొడిబారిన వాతావరణం కల్గిన ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఏడాది మొత్తమ్మీద 5 మి.మీ లేదా అంతకంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి అసలేమాత్రం వర్షం కూడా ఉండదు. అందుకే మానవ ఆవాసానికి అత్యంత కష్టతరమైన ప్రాంతంగా సహారా ఎడారి రికార్డుల్లో నిలిచింది. అలాంటి సహారా ఎడారిలో సరిగ్గా 50 ఏళ్ల క్రితం (1974లో) ఒకసారి ఇలాగా ఆరేళ్ల కరవు తర్వాత భారీ వర్షాలు కురిసాయి. అప్పుడు కూడా వరదలు సంభవించాయి. ఈ తరహా మార్పులు అప్పుడప్పుడూ సంభవించడం సహజమే. అయితే మానవ తప్పిదాలు ఈ మార్పుల తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 7, 8 తేదీల్లో ఎక్స్‌ట్రా ట్రాపికల్ సైక్లోన్ పరిస్థితి ఏర్పడింది. దీన్ని వాతావరణ శాస్త్రవేత్తలు తుఫానుగా పరిగణించరు. కానీ ఇది భారీ వర్షపాతానికి కారణమైంది. కేవలం రెండ్రోజుల వ్యవధిలో కురిసిన వర్షాలతో ఈ ఏడారిలో కొన్ని ప్రాంతాలు నీట ముంపునకు గురికావాల్సి వచ్చింది. నాసా శాటిలైట్ల ద్వారా పరిశీలిస్తే ఎడారి ఇసుక తెన్నెల మీదుగా నీటి ప్రవాహం స్పష్టంగా కనిపించింది. మొరాకో దేశంలోని ఇరికి సరస్సు 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ వర్షంతో పూర్తిగా నిండిపోయింది.

సహారా ఎడారిలో భారీ వర్షాలు, వరదలు

మరికొందరు శాస్త్రవేత్తలు సహారా ఎడారిలో సంభవించిన భారీ వర్షాలకు ఇంటర్‌ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ కారణమని అంచనా వేస్తున్నారు. భూగోళాన్ని భూమధ్య రేఖ రెండుగా విభజిస్తుంటే.. దానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఉత్తారార్థ గోళంగా, దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని దక్షిణార్థ గోళంగా పేర్కొంటాం. ఈ రెండు ప్రాంతాల మీదుగా వచ్చే గాలులు భూమధ్య రేఖక సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో కలిసి తుఫాను తరహా పరిస్థితులు సృష్టిస్తున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనాల ప్రకారం ఈ జోన్ కాస్త ఉత్తర దిశగా జరిగి సహారా ఎడారి ఉత్తర ప్రాంతంలో వర్షాలకు ఊతమిచ్చిందని అంటున్నారు.

వేడెక్కిన సముద్ర జలాలే కారణం

ఇంకొందరు శాస్త్రవేత్తలు మరోలా అంచనా వేస్తున్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఉత్తర భాగంలో జలాలతో పాటు మధ్యధరా సముద్రంలోని జలాలు సాధారణం కంటే ఎక్కువ వేడెక్కడం కారణంగానే సహారా ఎడారిలో వర్షాలు సంభవించాయని చెబుతున్నారు. ఈ జలాలు వేడెక్కడానికి వాతావరణంలో కాలుష్యం స్థాయులు పెరిగి భూతాపం పెరగడం వల్లనేనని, ఇది మానవ తప్పిదాల వల్లనే జరిగిందని సూత్రీకరిస్తున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే ఘటనలు మరిన్ని చోటుచేసుకుంటాయని కూడా వారు అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను నమోదు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సహారా ఎడారిలో ఇలాంటి తీవ్ర వాతావరణ మార్పులన్నీ వేసవి సమయంలోనే నమోదయ్యాయని వారు గుర్తుచేస్తున్నారు.

ధృవాల వైపు కదులుతున్న ఆకాశ నదులు

కొన్ని అధ్యయనాల ప్రకారం భూమ్మీద ప్రవహించే నదుల మాదిరిగానే భూ ఉపరితల వాతావరణంలో సన్నని పొడవైన నీటి పొరలు (Water Vapour) ఉంటాయి. వాటిని ఆకాశ నదులుగా అభివర్ణిస్తారు. ఇవే వర్షాలు, తుఫాన్లకు కారణమవుతుంటాయి. ఈ ఆకాశ నదుల్లో మార్పుల కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వరుస వర్షాభావ పరిస్థితులు, కరవు సంభవిస్తుండగా… మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. ఈ ఉపరితల నదులు ఉత్తర దిశగా కదిలి ఆర్కిటిక్ ప్రాంతానికి చేరుకుంటే.. అక్కడి మంచు కూడా కరిగిపోయి భూగోళం అంతటా అనూహ్య వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి అధ్యయన ఫలితాలను ‘అలాస్కా బీకాన్’ అనే సైన్స్ మ్యాగజైన్‌లో ప్రచురించారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించిన పరిశోధనా పత్రాల ప్రకారం ఆకాశ నదులు ఉత్తర ధృవం దిశగా 6 నుంచి 10 డిగ్రీల మేర జరిగాయి. గత నాలుగు దశాబ్దాల్లో జరిగిన మార్పు ఇది. ఈ ప్రభావంతో కారణంగా ఉత్తర అమెరికా, అలాస్కా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ఈ నివేదిక చెబుతోంది. మొత్తమ్మీద భూగోళంపై వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల వైపరీత్యాల్లోనూ తీవ్రమైన మార్పులు చోటుచేసుకుని నీటి ఎద్దటి ఓవైపు, వరదలు మరోవైపు మానవాళిని పట్టిపీడిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!
వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!
అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన చిక్కడపల్లి పోలీసులు
అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన చిక్కడపల్లి పోలీసులు
న్యూ ఇయర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారా.. ఈ టిప్స్ పాటించడం మస్ట్..!
న్యూ ఇయర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారా.. ఈ టిప్స్ పాటించడం మస్ట్..!
వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్
వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్
డాకూ మహరాజ్ ప్రెస్ మీట్..! శంబాల ఫస్ట్ లుక్ రిలీజ్..
డాకూ మహరాజ్ ప్రెస్ మీట్..! శంబాల ఫస్ట్ లుక్ రిలీజ్..
కృష్ణుడి గోపికలుగా అక్కాచెల్లెళ్లు.. ఎవరో గుర్తు పట్టారా?
కృష్ణుడి గోపికలుగా అక్కాచెల్లెళ్లు.. ఎవరో గుర్తు పట్టారా?
రూ.6 లక్షల విలువైన పాత కారును లక్షకు అమ్మితే రూ.90 వేల జీఎస్టీ
రూ.6 లక్షల విలువైన పాత కారును లక్షకు అమ్మితే రూ.90 వేల జీఎస్టీ
గుడ్లను వీటితో కలిపి తింటే డేంజర్ బెల్స్ మోగినట్లే.. జాగ్రత్త!
గుడ్లను వీటితో కలిపి తింటే డేంజర్ బెల్స్ మోగినట్లే.. జాగ్రత్త!
టీమిండియా స్టార్ పేసర్ బౌలింగ్ యాక్షన్‌పై ఆరోపణలు
టీమిండియా స్టార్ పేసర్ బౌలింగ్ యాక్షన్‌పై ఆరోపణలు
రేపు, ఎల్లుండి శబరిమల అయ్యప్ప దర్శనాల సంఖ్య తగ్గింపు.. ఎందుకంటే
రేపు, ఎల్లుండి శబరిమల అయ్యప్ప దర్శనాల సంఖ్య తగ్గింపు.. ఎందుకంటే