ecalcus app : ఉచిత ఆన్ లైన్ టీచింగ్ యాప్ ‘ఇకాల్కస్’ ను ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
యుకెజి నుండి ఇంటర్మీడియట్, జెఇఇ, ఇంకా.. నీట్ వరకు విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి ఉచిత ఆన్‌లైన్ వేదికను సృష్టించింది...
free online classes app : హైదరాబాద్ నగరానికి చెందిన ‘కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్’ యుకెజి నుండి ఇంటర్మీడియట్, జెఇఇ, ఇంకా.. నీట్ వరకు విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి ఉచిత ఆన్‌లైన్ వేదికను సృష్టించింది. ‘ఇకాల్కస్’ పేరిట రూపొందించిన ఈ యాప్‌ను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా గణిత, విజ్ఞాన విషయాలపై ప్రాక్టీస్ మెటీరియల్ తోపాటు.. హిందీ, ఇంగ్లీషులలో బోధించే యానిమేటెడ్ వీడియోలను తరగతుల వారీగా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం 1050 కి పైగా వీడియోలు, 19 600 కి పైగా ప్రశ్నలు ఈ యాప్ లో పొందుపరచబడ్డాయి. గూగుల్ ప్లే స్టోర్ నుండి “ఇకాల్కస్ ఫ్రీ ఆన్‌లైన్ క్లాసెస్” యాప్ ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా విద్యార్థులు సంబంధిత కోర్సులను ఉచితంగా చూడవచ్చు. వారి పేర్లను కూడా నమోదు చేసుకోవచ్చు.
ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థులకు ఇటువంటి ఉచిత సేవలను అందించినందుకు మంత్రి సబిత.. సంస్థ వ్యవస్థాపకురాలు వనికుమారిని సంస్థ సిబ్బందిని ప్రశంసించారు.