Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy A15: 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ శామ్సంగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ మిస్ కాకండి..

ప్రస్తుతం మార్కెట్ లో 5జీ ఫోన్లకు విపరీతమైన ఆదరణ ఉంది. కొనుగోలుదారులు వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేకతలతో పాటు తగ్గింపు ధరలు ప్రకటించడంతో వీటి అమ్మకాలు బాగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ కంపెనీ సామ్సంగ్ తన గెలాక్సీ ఏ15 స్మార్ట్ ఫోన్ ను తగ్గింపు ధరకు అందజేస్తుంది.

Samsung Galaxy A15: 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ శామ్సంగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ మిస్ కాకండి..
Samsung Galaxy A15
Follow us
Madhu

|

Updated on: Apr 04, 2024 | 3:53 PM

మార్కెట్ లోని నిత్యం వివిధ రకాల స్మార్ట్ ఫోన్లు, అనేక ఫీచర్లతో విడుదలవుతున్నాయి. ఒకదానికి మించి మరొకటి ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో 5జీ ఫోన్లకు విపరీతమైన ఆదరణ ఉంది. కొనుగోలుదారులు వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేకతలతో పాటు తగ్గింపు ధరలు ప్రకటించడంతో వీటి అమ్మకాలు బాగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ కంపెనీ సామ్సంగ్ తన గెలాక్సీ ఏ15 స్మార్ట్ ఫోన్ ను తగ్గింపు ధరకు అందజేస్తుంది.

రెండు వేరియంట్లు..

సామ్సంగ్ తన గెలాక్సీ ఏ15 స్మార్ట్ ఫోన్ ను గతేడాది డిసెంబర్ లో మార్కెట్ లోకి విడుదల చేసింది. ప్రజల ఆదరణ పొందిన ఈ ఫోన్ ను ఇప్పుడు ప్రత్యేక తగ్గింపు ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఈ మోడల్ లో విడుదల చేసిన రెండు వేరియంట్లకూ తగ్గింపు ధరను అమలు చేసింది. ఈ 5జీ ఫోన్ మీడియా టెక్ చిప్ సెట్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌, ఎఫ్ హెచ్ డీ+ డిస్ ప్లేతో లభిస్తుంది. 25వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్టు చేస్తుంది.

తగ్గింపు ధరలు..

సామ్సంగ్ గెలాక్సీ ఏ15 5జీ ఫోన్ 128 వెర్షన్ పై రూ.1500 తగ్గింపు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.17,999 ధరకు మార్కెట్ లో అందుబాటులో ఉంది. అలాగే 256 జీబీ వెర్షన్ కూడా రూ.3000 తగ్గింపు తర్వాత రూ.19,499కు లభిస్తుంది. రెండు ఫోన్లూ 8జీబీ ర్యామ్ తో అందుబాటులో ఉన్నాయి. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. అదనపు స్టోరేజ్ కోసం మైక్రో ఎస్ డీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. అందమైన గ్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు 1080×2340 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 6.5 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ డిస్‌ప్లే ఆకట్టుకుంటున్నాయి. 90 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్‌ల గరిష్ట కాంతితో మెరుగైన పనితీరు కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

సెక్యూరిటీ..

ఈ ఫోన్ కు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ అమర్చారు. 5జీ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇక కెమెరా ప్రత్యేకతల విషయానికి వస్తే 50 ఎమ్ పీ ట్రిపుల్ కెమెరా కాన్ఫిగరేషన్‌, వీడీఐఎస్ సాంకేతికతతో రూపొందించారు. దీనివల్ల వీడియోలను బ్లర్ లేకుండా స్పష్టతంగా చూడవచ్చు. ప్రైమరీ కెమెరాకు అనుబంధంగా 5 ఎమ్ పీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2 ఎమ్ పీ మాక్రో షూటర్ ఉన్నాయి. ఇక సెల్ఫీ ప్రియులకు అత్యంత ఉపయోగంగా ఉంటుంది. దీనిలోని 13 ఎమ్ పీ ఫ్రంట్ కెమెరాతో నాణ్యత గల చిత్రాలను తీసుకోవచ్చు.

శక్తివంతమైన బ్యాటరీ..

సామ్సంగ్ గెలాక్సీ ఏ15 5జీ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో చాలా సమర్థంగా పనిచేస్తుంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. మెరుగైన బ్యాటరీ కారణంగా చార్జింగ్ ఎక్కువ సమయం వస్తుంది. మాటిమాటికీ చార్జింగ్ పెట్టుకునే అవస్థలు తప్పుతాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..