Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రహంపై రాళ్ల వర్షాలు, తుఫాను గాలులు, అత్యధిక వేడి.. కీలక విషయాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు

ఇటీవల జరిపిన అధ్యయనాలలో ఈ రెండు గ్రహాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించారు. ఈ గ్రహాల ద్వారా పాలపుంతలోని వైవిధ్యం, సంక్లిష్టత వంటి రహస్యాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ గ్రహాల ద్వారా విశ్వంలోని గ్రహ వ్యవస్థ అభివృద్ధిలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదికలో శాస్త్రవేత్తలు.. హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా భూమికి 1300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి డబ్ల్యుఏఎస్‌పీ-178b అనే గ్రహాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఆ గ్రహంపై రాళ్ల వర్షాలు, తుఫాను గాలులు, అత్యధిక వేడి.. కీలక విషయాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు
Planets
Follow us
Aravind B

|

Updated on: Aug 27, 2023 | 1:21 PM

కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు రెండు గ్రహాలను కనుగొన్నారు. అయితే ఈ గ్రహాలు మిగిలిన గ్రహాల కన్నా భిన్నంగా ఉన్నాయి. వాటి పరిమాణం చూసుకుంటే కూడా బృహస్పతి గ్రహానికి సమానంగా ఉంది. ఈ రెండు గ్రహాలు మన పాలపుంత గెలాక్సీలో వాటి నక్షత్రానికి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు గ్రహాలు అక్కడి అధిక ఉష్ణోగ్రత కారణంగా వేడెక్కుతాయని అలాగే ఈ గ్రహాల్లో ఒకదానిపై ఆవిరితో కూడిన రాళ్ల వర్షం కూడా కురుస్తుండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ తీవ్రతకు టైటానియం వంటి శక్తివంతమైన లోహాలు కూడా కరిగి ఆ గ్రహంపై ఆవిరైపోతాయని అంటున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన అధ్యయనాలలో ఈ రెండు గ్రహాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించారు. ఈ గ్రహాల ద్వారా పాలపుంతలోని వైవిధ్యం, సంక్లిష్టత వంటి రహస్యాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ గ్రహాల ద్వారా విశ్వంలోని గ్రహ వ్యవస్థ అభివృద్ధిలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదికలో శాస్త్రవేత్తలు.. హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా భూమికి 1300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి డబ్ల్యుఏఎస్‌పీ-178b అనే గ్రహాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ గ్రహంపై ఉన్న వాతావరణంలో సిలికాన్ మోనాక్సైడ్ అనే వాయువు కూడా ఉంటుంది.

అలాగే ఈ గ్రహంపై పగటిపూట అసలు మేఘాలు అనేవి ఉండవని.. అయితే రాత్రిపూట మాత్రం గంటకు రెండు వేల మైళ్ల వేగంతో తుఫాను గాలులు వీస్తాయని పరిశోధకులు తెలిపారు. అలాగే ఈ గ్రహం దాని నక్షత్రానికి చాలా దగ్గరగా ఉంది. దీంతో పాటు ఈ గ్రహంలోని ఒక భాగం ఎప్పుడూ కూడా నక్షత్రం వైపు ఉంటుంది. అలాగే అవతలి వైపున ఉన్న సిలికాన్ మోనాక్సైడ్ మాత్రం చాలా చల్లగా ఉండడం వల్ల మేఘాల నుంచి నీరుకు బదులుగా రాళ్ల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. ఈ గ్రహం మీద ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఉష్ణోగ్రత కూడా చాలా అత్యధికంగా ఉంటుంది. దీని వల్ల రాళ్లు కూడా ఆవిరిగా మారిపోతాయి. పరిశోధకుల తెలిపిన అభిప్రాయం ప్రకారం చూసుకుంటే.. మొదటిసారిగా సిలికాన్ మోనాక్సైడ్ ఇలాంటి రూపంలో కనిపించింది. మరొక అధ్యయనం ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. ఇందులో అత్యంత వేడి వాతావరణం ఉన్న గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారని రాసుకొచ్చారు. భూమికి 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ‍ గ్రహానికి కేఈఎల్‌టీ-20బీ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి గ్రహాలు కనిపెడతారో వేచి చూడాలి.

మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో