AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

401 Call Forwarding Scam: స్కామర్ల నయా స్కెచ్‌.. ఆ నంబర్‌కు ఫోన్‌ చేస్తే మీ సొమ్ము ఫసక్‌

మోసపూరిత కాల్ ఫార్వార్డింగ్ స్కామ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌లు లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ల నుంచి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌లుగా ఫోన్‌ చేసి అవగాహన లేని వ్యక్తులను దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జియో, ఎయిర్‌టెల్ సహా ఇతర టెలికాం ఆపరేటర్లు కాల్-ఫార్వార్డింగ్ స్కామ్‌కు వ్యతిరేకంగా వినియోగదారులను హెచ్చరిస్తుంది. ఈ కాల్‌ ఫార్వార్డింగ్‌ స్కామ్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

401 Call Forwarding Scam: స్కామర్ల నయా స్కెచ్‌.. ఆ నంబర్‌కు ఫోన్‌ చేస్తే మీ సొమ్ము ఫసక్‌
Fraud Calls
Nikhil
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 30, 2023 | 7:30 AM

Share

ఇటీవల కాలంలో వివిధ స్కామ్‌లతో స్కామర్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. తాజాగా ఇప్పుడు మోసపూరిత కాల్ ఫార్వార్డింగ్ స్కామ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌లు లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ల నుంచి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌లుగా ఫోన్‌ చేసి అవగాహన లేని వ్యక్తులను దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జియో, ఎయిర్‌టెల్ సహా ఇతర టెలికాం ఆపరేటర్లు కాల్-ఫార్వార్డింగ్ స్కామ్‌కు వ్యతిరేకంగా వినియోగదారులను హెచ్చరిస్తుంది. ఈ కాల్‌ ఫార్వార్డింగ్‌ స్కామ్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

కాల్ ఫార్వార్డింగ్ స్కామ్ అంటే?

సామర్లు మొబైల్ లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కస్టమర్ సర్వీస్ ప్రతినిధుల  పేరుతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కాల్‌ చేస్తారు. వారు వారి మొబైల్ ఇంటర్నెట్, ఖాతా భద్రత లేదా సిమ్‌ కార్డ్‌ల సమస్యలను పేర్కొంటూ వాళ్లను మభ్యపెడతారు. అలా మాటల్లో పెట్టి ముఖ్యంగా 401 వంటి నిర్దిష్ట నంబర్‌ను డయల్ చేసేలా చేస్తారు. ఇలా చేస్తే మన ఫోన్‌ యాక్సెస్‌ను వాళ్లు చేతికి చేరుతుంది. 401 నెంబర్‌కు కాల్‌ చేయడం ద్వారా కాల్ ఫార్వార్డింగ్‌ యాక్టివేట్‌ అవుతుంది. ముఖ్యంగా స్కామర్లు మన ఫోన్‌ కాల్స్‌, మేసేజ్‌లను హ్యాక్‌ బ్యాంకులను నుంచి సొమ్ము కొట్టేస్తారు. ముఖ్యంగా వినియోగదారులను ఎలాగైనా మాయ మాటలతో మభ్య 401కు కాల్‌ చేసేలా చేస్తారు. ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువయ్యాయి. స్కామర్లు మనల్ని ఎంత మభ్యపెట్టిన 401 నెంబర్‌ కాల్‌ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 

ముఖ్యంగా స్కామర్‌ తన ఫోన్ నంబర్ చెప్పి తర్వాత కోడ్ 401ని ఉపయోగిస్తాడు. ఇలా చేయడం ద్వారా స్కామర్ కాల్ ఫార్వార్డింగ్‌ను సక్రియం చేస్తాడు. తద్వారా ఇన్‌కమింగ్ కాల్‌లను వారి సొంత పరికరానికి మళ్లించవచ్చు. 401 కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా ముఖ్యంగా బాధితుల ఫోన్ నంబర్‌కు యాక్సెస్‌ని ఇస్తుంది. సందేశ యాప్‌లు, బ్యాంక్ ఖాతాలతో సహా వివిధ ఖాతాలకు అనధికారిక లాగిన్‌లను ప్రయత్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాల్ ఫార్వార్డింగ్ ఫీచర్ స్కామర్‌లకు బాధితుడి ఫోన్‌కి పంపిన వాయిస్ వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను (ఓటీపీ) స్వీకరించే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

రక్షణ ఇలా

  • డయలింగ్ కోడ్‌లు లేదా ఎస్‌ఎంఎస్‌లను పంపడం వీలైనంత మానుకోవాలి. ఎప్పుడూ కోడ్‌లను డయల్ చేయకూడదు. లేదా తెలియని మూలాల ద్వారా వచ్చిన టెక్ట్స్‌ మెసేజ్‌లకు స్పందించకూడదు. కాల్ ఫార్వార్డింగ్‌ని యాక్టివేట్ చేయడానికి స్కామర్‌లు తరచుగా ఈ పద్ధతులను ఉపయోగిస్తారు.
  • మీ స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా ఉంచడానికి పాస్‌కోడ్‌లు లేదా బయోమెట్రిక్ ప్రామాణీకరణ పద్ధతులను ఉపయోగించాలి. మీ పరికరానికి అనధికార ప్రాప్యతను నిరోధించాలి.
  • ఓటీపీలు వంటి సున్నితమైన సమాచారాన్ని మీ ఐఎస్‌పీ లేదా మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ నుండి వచ్చినట్లు కాల్‌ చేసే వారిపై జాగ్రత్త వహించాలి. ఏదైనా డేటాను షేర్ చేయడానికి ముందు వారి గుర్తింపును ధ్రువీకరించుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..