Samsung galaxy a05: సామ్‌సంగ్ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే
గ్యాలక్సీ ఏ04 స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ. 11,999గా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సామ్‌సంగ్ ఈ సిరీస్‌కి కొనసాగింపుగా సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ05 ఫోన్‌ను లాంచ్ చేయనుంది. త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట మాత్రం ఈ ఫోన్ ఫీచర్లకు, డిజైన్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు, వివరాలు...

సౌత్ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల వరుసగా స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌తో పాటు ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తీసుకొచ్చిన సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ04కి కొనసాగింపుగా ఏ05 ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ04 స్మార్ట్ ఫోన్‌ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది సామ్‌సంగ్.
గ్యాలక్సీ ఏ04 స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ. 11,999గా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సామ్‌సంగ్ ఈ సిరీస్‌కి కొనసాగింపుగా సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ05 ఫోన్‌ను లాంచ్ చేయనుంది. త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట మాత్రం ఈ ఫోన్ ఫీచర్లకు, డిజైన్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు, వివరాలు లీక్ అవుతున్నాయి. వీటి ఆధారంగా అసలు ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
నెట్టింట లీక్ అయిన సమాచారం మేరకు సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ05 స్మార్ట్ ఫోన్ లైట్ గ్రీన్, బ్లాక్, సిల్వర్ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకురానున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించనున్నారు. వాటర్ డ్రాప్ నాచ్‌తో ఈ డిస్‌ప్లేతో రానున్నట్లు సమాచారం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 25 వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే వైఫై 5, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ – సీ పోర్ట్‌తో పాటు 3.5 ఎమ్‌ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేయనుంది. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ రూ. 14,990గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నెలలో ఈ ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి.