- Telugu News Photo Gallery Technology photos Follow these tech tips to save data in smartphone Telugu Tech News
Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్‌లో డేటా త్వరగా అయిపోతుందా.? ఈ టిప్స్ పాటించండి..
స్మార్ట్‌ఫోన్‌ను, మనిషిని వేరు చేసి చూడలేని పరిస్థితి వచ్చింది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ జీవితంలో ఓ భాగమైపోయింది. ఇంటర్నెట్ ధరలు తగ్గడం, స్పీడ్ పెరగడంతో ఇంటర్‌నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల మనం ఉపయోగించే డేటా త్వరగా పూర్తి అవుతుంది. అయితే డేటా త్వరగా పూర్తికాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించొచ్చు. ఇంతకీ ఈ ఆ టిప్స్ ఏంటంటే...
Updated on: Sep 25, 2023 | 8:42 PM

స్మార్ట్ ఫోన్స్‌లో ఉండే కొన్ని యాప్స్ ఆటోమెటిక్‌గా అప్‌డేట్ అవుతుంటాయి. దీనివల్ల కూడా ఇంటర్నెట్ డేటా త్వరగా పూర్తవుతుంది. అందుకే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటోమెటిక్ డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవాలి. వైఫై ఉపయోగిస్తున్న సమయంలోనే యాప్స్‌ను అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం.

ఇక ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో డేటా సేవింగ్ మోడ్ ఫీచర్స్‌ను అందిస్తున్నాయి. ఇలాంటి ఆప్షన్ ఉన్న వారు యాక్టివేట్ చేసుకుంటే డేటా సేవ్ చేసుకోవచ్చు. డేటా సేవింగ్ మోడ్ ఫీచర్ సహాయంతో వీలైనంత ఎక్కువ డేటాను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇటీవల గూగూల్ మ్యాప్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. వీటివల్ల కూడా ఎక్కువ డేటా యూజ్ అవుతుంటుంది. అయితే ఇలాంటి యాప్స్‌ను ఆన్‌లైన్ మోడ్‌లో కాకుండా ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉపయోగించుకోవాలి. దీనివల్ల కూడా ఇంటర్నెట్ డేటాను వీలైనంత వరకు సేవ్ చేసుకోవచ్చు.

సాధారణంగా జర్నీలో ఉన్న సమయంలో ఓటీటీ వేదికల్లో లేదా యూట్యూబ్‌లో వీడియోలను స్ట్రీమింగ్ చేస్తుంటాం. అయితే అలా కాకుండా ఎక్కడైనా వైఫై అందుబాటులో ఉన్న సమయంలో కొన్ని వీడియోలను ఆఫ్‌లైన్ మోడ్‌లో సేవ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొబైల్ ఫోన్ డేటాను వీలైనంత వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

డేటా పూర్తి కావడానికి మరో ప్రధాన కారణం వాట్సాప్‌లో కంటెంట్ డౌన్‌లోడ్ అవుతుండడం. మన ప్రమేయం లేకుండానే వాట్సాప్‌లో వీడియోలు, ఫొటోలు డౌన్‌లోడ్ అవుతుంటాయి. దీనివల్ల కూడా డేటా త్వరగా పూర్తవుతుంది. కాబట్టి వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటోమెటిక్ డౌన్‌లోడ్‌ను ఆఫ్ చేసుకుంటే డేటాను సేవ్ చేసుకోవచ్చు.





























