SmartTag 2: ఈ చిన్న గ్యాడ్జెట్ ఉంటే చాలు, మీ లగేజ్ సేఫ్.. సామ్‌సంగ్ నుంచి స్మార్ట్‌ట్యాగ్..
ఈ గ్యాడ్జెట్‌తో మీ వస్తువులను, పెండుపు జంతువులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. యాపిల్‌కు చెందిన ఎయిర్ ట్యాగ్‌కు పోటీగా సామ్‌సంగ్ ఈ కొత్త స్మార్ట్‌ట్యాగ్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ట్యాగ్ ధర రూ. 2,799గా ఉంది. అమెజాన్‌తో పాటు సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్ ట్యాగ్ అందుబాటులో ఉంది. ఇందులోని లాస్ట్ మోడ్ ఫీచర్ సహాయంతో మీ వస్తువులు చివరిగా ఎక్కడో ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే లైవ్ లొకేషన్‌ను...

విలువైన వస్తువులను ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం. లేదంటే ప్రయాణం చేసే సమయంలో బ్యాగులు మారిపోతుంటాయి. ఇక పెంపుడు జంతువులను అలా పార్కుకు తీసుకెళ్తే ఎటో వెళ్లిపోతుంటాయి. ఇక వాటిని వెతకడం ఇబ్బందిగా మారుతుంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికే సామ్‌సంగ్ గ్యాలక్సీ స్మార్ట్ ట్యాగ్2 పేరుతో మార్కెట్లోకి కొత్త గ్యాడ్జెట్‌ను విడుదల చేసింది.
ఈ గ్యాడ్జెట్‌తో మీ వస్తువులను, పెండుపు జంతువులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. యాపిల్‌కు చెందిన ఎయిర్ ట్యాగ్‌కు పోటీగా సామ్‌సంగ్ ఈ కొత్త స్మార్ట్‌ట్యాగ్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ట్యాగ్ ధర రూ. 2,799గా ఉంది. అమెజాన్‌తో పాటు సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్ ట్యాగ్ అందుబాటులో ఉంది. ఇందులోని లాస్ట్ మోడ్ ఫీచర్ సహాయంతో మీ వస్తువులు చివరిగా ఎక్కడో ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే లైవ్ లొకేషన్‌ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఎలా పని చేస్తుందంటే..
సామ్‌సంగ్ గ్యాలక్సీ స్మార్ట్‌ట్యాగ్ 2ను స్మార్ట్ ఫోన్‌లో స్మార్ట్ థింగ్స్ ఫైండ్ యాప్‌తో కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం యాప్‌లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం స్మార్ట్ ట్యాగ్‌ను మీ వస్తువులకు కనెక్ట్ చేసుకుంటే చాలు ఎప్పటికప్పుడు మీ వస్తువులను, పెంపుడు జంతువులను ట్రాక్ చేస్తుంది.
ఫీచర్ ఎలా ఉన్నాయంటే..
* ఈ స్మార్ట్ ట్యాగ్‌లో కంపాస్ వ్యూ అనే ప్రత్యేక ఫీచర్‌ను అందించారు. దీంతో నాణ్యమైన విజువల్‌తో కూడిన డైరెక్షన్స్‌ను యూజర్ చూడొచ్చు. మీ స్మార్ట్ ట్యాగ్ అటాచ్ చేసిన మీ వస్తువు ఎంత దూరంలో ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఏదైనా అల్ట్రా వైడ్ బ్యాండ్ లేదా గ్యాలక్సీ స్మార్ట్ ఫోన్‌తో ఈ స్మార్ట్ ట్యాగ్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు.
* ఇక లాస్ట్ మోడ్ ఫీచర్ సహాయంతో మీ వస్తువు చివరి లొకేషన్ ఎక్కడుందే ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా మీ స్మార్ట్ ట్యాగ్‌ను గమనిస్తే వారి స్మార్ట్ ఫోన్‌తో ట్యాగ్‌ను స్కాన్ చేస్తే చాలు సదరు స్మార్ట్ ట్యాగ్ యజమాని వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
* ఈ స్మార్ట్ ట్యాగ్‌లో పవర్ సేవింగ్ మోడ్‌ను ప్రత్యేకంగా అందించారు. ఈ స్కానర్ బ్యాటరీ లైఫ్ ఏకంగా 700 రోజులు రావడం విశేషం. అంతకు ముందు తీసుకొచ్చిన గ్యాలక్సీ స్మార్ట్ ట్యాగ్ బ్యాటరీ 500 రోజులుగా ఉండేది.
* ఇక దీనిని నీరు, దుమ్మును తట్టుకునే విధంగా IP67 రేటింగ్‌తో అప్‌గ్రేడ్ వెర్షన్‌తో తీసుకొచ్చారు. ఈ ట్యాగ్‌ను కలిగి ఉన్న వస్తువులు, బ్యాగ్‌లను పోగొట్టుకోవడం అసాధ్యం అని కంపెనీ చెబుతోంది
* ఈ స్మార్ట్ ట్యాగ్ బరువు కేవలం 13.75 గ్రాములు ఉంటుంది. ట్రాకింగ్ పరిధి 120 మీటర్లు. ఈ స్మార్ట్ ట్యాగ్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..