Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో నాలుగు అద్భుత ఫీచర్లు.. ఇంతకీ వీటి ఉపయోగం ఏంటంటే
తాజాగా జెన్‌జెడ్‌ను ఆకట్టుకునేందుకు మరొకొన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ లాంచ్ అయిన 13 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా 4 కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంతకీ ఈ ఫీచర్ల ఉపయోగం ఏంటి.? వీటిని ఎలా ఉపయోగించాలి.? లాంటి వివరాలపై ఓ లుక్కేయండి.. ఇన్‌స్టాగ్రామ్ తీసుకొస్తున్న ఈ నాలుగు కొత్త ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు...

ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్‌తో అట్రాక్ట్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ తాజాగా జెన్‌జెడ్‌ను ఆకట్టుకునేందుకు మరొకొన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ లాంచ్ అయిన 13 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా 4 కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంతకీ ఈ ఫీచర్ల ఉపయోగం ఏంటి.? వీటిని ఎలా ఉపయోగించాలి.? లాంటి వివరాలపై ఓ లుక్కేయండి.. ఇన్‌స్టాగ్రామ్ తీసుకొస్తున్న ఈ నాలుగు కొత్త ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
* ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్న కొత్త ఫీచర్స్‌లో డేట్స్ రిమైండర్ ఒకటి. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో స్నేహితుల పుట్టిన తేదీ రీమైండర్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఫీచర్‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకురానున్నారు. ఈ ఫీచర్ ఫాలోయర్లకు, స్నేహితులకు మీ పుట్టిన తేదీని గుర్తు చేస్తుంది. స్టిక్కర్లు, కాన్ఫెటీలతో విషెస్ చెప్పేలా డిజైన్ చేశారు.
* ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం కొందరికి మాత్రమే మీ స్టోరీలు కనిపించేలా ‘క్లోజ్ ఫ్రెండ్స్’ అనే ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫీచర్‌కు అప్‌డేట్ తీసుకురానున్నారు. స్టోరీలకు మరిన్ని క్యాటగిరీలు యాడ్ చేయనున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కోలిగ్స్ ఇలా క్యాటగీరి వారీగా స్టోరీలను షేర్ చేసుకోవచ్చన్నమాట.
* ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాయిస్ మెసేజ్ ఫీచర్‌కు అదనంగా కొత్త అప్‌డేట్ తీసుకురానున్నారు. నోట్స్ సెక్షన్ నుంచే ఆడియో మెసేజ్‌లు పోస్ట్ చేయొచ్చు. ఇవి డైరెక్ట్ మేసేజ్ లిస్ట్‌లో అన్నింటికంటే పైన కనిపిస్తాయి.
* ఇక కేవలం ఆడియో నోట్స్ మాత్రమే కాకుండా, చిన్న చిన్న వీడియోలను రికార్డ్ చేసి కూడా నోట్‌గా పోస్ట్ చేయొచ్చు. ఈ పోస్ట్ కేవలం 24 గంటల వరకు ఉంటుంది. వాట్సాప్‌లో కూడా ఇలాంటి ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
* నోట్స్‌లో లొకేషన్‌ను ట్యాగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ఇన్‌స్టాగ్రామ్ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తాము ఎక్కడున్నామో తెలపుపొచ్చు. ట్యాగ్ చేసిన లొకేషన్ నోట్స్‌లో టెక్ట్స్ మీద కనిపిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..