AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy S24: ఆ శామ్సంగ్ ఫోన్‌పై ఏకంగా రూ. 12,000 తగ్గింపు.. త్వరపడండి.. సమయం లేదు..

శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 ఈ ఏడాది ప్రారంభంలో భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఆ సమయంలో రూ.79,999 ప్రారంభ ధర ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ పై మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. పరిమిత కాల స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ కింద ఈ గెలాక్సీ ఎస్ 24పై భారీ తగ్గింపు అందిస్తోంది. మొత్తం మీద రూ. 12,000 డిస్కౌంట్ ను ఈ ఫోన్ పై మీరు పొందొచ్చు.

Samsung Galaxy S24: ఆ శామ్సంగ్ ఫోన్‌పై ఏకంగా రూ. 12,000 తగ్గింపు.. త్వరపడండి.. సమయం లేదు..
Samsung Galaxy S24
Madhu
|

Updated on: Aug 10, 2024 | 4:46 PM

Share

ప్రస్తుతం ఆన్ లైన్ ప్లాట్ ఫాంలలో ఆఫర్ల సీజన్ నడుస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్లు ప్రత్యేక సేల్స్ నడుపుతున్నాయి. ఈ క్రమంలో శామ్సంగ్ కూడా తన ప్రీమియం ఫోన్ పై అదిరే ఆఫర్లను ప్రకటించింది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 ఈ ఏడాది ప్రారంభంలో భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఆ సమయంలో రూ.79,999 ప్రారంభ ధర ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ పై మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. పరిమిత కాల స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ కింద ఈ గెలాక్సీ ఎస్ 24పై భారీ తగ్గింపు అందిస్తోంది. మొత్తం మీద రూ. 12,000 డిస్కౌంట్ ను ఈ ఫోన్ పై మీరు పొందొచ్చు. అంతేకాక నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్24పై తగ్గింపులు ఇలా..

శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని అసలు ధర రూ. 74,999గా ఉంది. ప్రస్తుతం ఈ స్వాతంత్య్ర దినోత్సవ తగ్గింపులో భాగంగా ఇది రూ. 62,999కే అందుబాటులో ఉంది. వినియోగదారులకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ. 5,666 ఈఎంఐతో 24 నెలల కాలపరిమితితో ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. శామ్సంగ్ వెబ్ సైట్లో పేర్కొన్న దాని ప్రకారం ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకూ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

అదే సమయంలో 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,999 కాగా.. ప్రస్తుత ఆఫర్లో భాగంగా దీనిని 67,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే 512జీబీ వేరియంట్ రూ. 89,999 కాగా.. దానిని కేవలం రూ. 77,999కి కొనుగోలు చేయొచ్చు.

పోటీధరతో అమ్మకాలు..

శామ్సంగ్ తో పాటు పలు ఆన్‌లైన్ రిటైలర్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కూడా గెలాక్సీ ఎస్ 24పై పోటాపోటీగా ఆఫర్లను అందిస్తున్నాయి. దీనికి సంబంధించిన లిస్టింగ్స్ పరిశీలిస్తే.. అమెజాన్లో ప్రారంభ ధర రూ.56,000 కాగా, ఫ్లిప్‌కార్ట్ తక్కువ వేరియంట్‌ను రూ.62,000కు అందిస్తోంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 స్పెసిఫికేషన్స్..

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 స్మార్ట్ ఫోన్ 1 హెర్జ్ నుంచి 120 హెర్జ్ వరకూ వేరియబుల్ రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ సపోర్ట్‌తో 6.2-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో ఎక్సినోస్ 2400 ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఇక కెమెరా సెటప్‌ విషయానికి వస్తే 50-మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ముందు భాగంలో, ఇది 12-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్, 25వాట్ల వైర్డ్ ఛార్జింగ్, 15వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ పవర్‌షేర్ ఫంక్షనాలిటీని కూడా కలిగి ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..