- Telugu News Photo Gallery Technology photos Instagram introducing new feature, now users can upload 20 photos at at time
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. ఫొటోలు పోస్ట్ చేసే వారికి పండగే..
Updated on: Aug 10, 2024 | 4:23 PM

ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌కు ఇంతటి క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం ఇందులో తీసుకొచ్చిన ఫీచర్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మరో కొత్త అప్‌డేట్‌తో యూజర్లు ముందుకు వచ్చింది.

ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 10 ఫొటోలు, లేదా వీడియోలు మాత్రమే అప్‌లోడ్ చేసుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ అకౌంట్‌లో సింగిల ఫోస్ట్‌లో ఏకంగా 20 ఫొటోలు లేదా వీడియోలను షేర్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఒకే పోస్ట్‌లో ఎక్కువ ఫొటోలు షేర్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్‌డేట్ సహాయంతో క్రియేటివిటీతో రిచ్ కంటెంట్‌ను షేర్ చేసేందుకు మంచి అవకాశం లభించనుంది. అయితే ఇలా ఫొటోలను ఒకే పోస్ట్‌లో షేర్ చేయడం ద్వారా యూజర్లకు విసుగు వచ్చే అవకాశం ఉంటుందననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటోలను ఎక్కువగా షేర్ చేయడం వల్ల ఫాలోవర్స్ గందరగోళానికి ఇబ్బంది పడేఅవకాశాలుంటాయని అంటున్నారు. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకొస్తున్న ఈ అప్‌డేట్ యూజర్లను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.




