AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ యాప్స్‌ మీ ఫోన్‌లో ఉన్నాయా? వెంటనే డిలిట్‌ చేసేయండి.. లేదంటే నష్టపోతారు!

స్మార్ట్‌ఫోన్‌లలోని మీ వ్యక్తిగత డేటా భద్రతకు ప్రమాదకరమైన యాప్‌లు ముప్పు. అనధికారిక యాప్‌లు, అనవసరమైన అనుమతులు అడిగేవి, నకిలీ బ్యాంకింగ్ యాప్‌లు మీ సమాచారాన్ని దొంగిలించవచ్చు. మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచడానికి అధికారిక స్టోర్‌ల నుంచే డౌన్‌లోడ్ చేయండి, అనుమతులను పరిశీలించండి, అప్‌డేట్‌లను క్రమం తప్పకుండా చేయండి.

ఈ యాప్స్‌ మీ ఫోన్‌లో ఉన్నాయా? వెంటనే డిలిట్‌ చేసేయండి.. లేదంటే నష్టపోతారు!
Mobile
SN Pasha
|

Updated on: Mar 08, 2026 | 6:14 AM

Share

స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. బ్యాంకింగ్‌ నుంచి వ్యక్తిగత సంభాషణలు, ఫోటోలు నుంచి అధికారిక పత్రాలు వరకు చాలా ముఖ్యమైన సమాచారం ఫోన్లలోనే నిల్వ ఉంటుంది. అయితే భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని ప్రమాదకర యాప్స్‌ కారణంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావచ్చని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల ప్రకారం ముఖ్యంగా తెలియని వెబ్‌సైట్లు లేదా అనధికారిక యాప్ స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసే యాప్స్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఉంచకూడదు. ఇవి చాలా సందర్భాల్లో మాల్వేర్ లేదా స్పైవేర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే ఈ యాప్స్ వినియోగదారుల కాంటాక్ట్స్‌, ఫోటోలు, మెసేజ్‌లు, బ్యాంకింగ్ వివరాలను కూడా గమనించే ప్రమాదం ఉంది. అలాగే అవసరం లేని అనుమతులను అడిగే యాప్స్‌ కూడా ప్రమాదకరంగా మారవచ్చు. ఉదాహరణకు సాధారణ టార్చ్‌లైట్‌ లేదా గేమ్ యాప్ అయినా కాంటాక్ట్స్‌, కెమెరా, మైక్రోఫోన్ లేదా లోకేషన్ యాక్సెస్ కోరితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి యాప్స్ వినియోగదారుల డేటాను సేకరించి ఇతర సంస్థలకు విక్రయించే అవకాశం ఉంటుంది.

ఇంకా నకిలీ బ్యాంకింగ్ లేదా రివార్డు యాప్స్ కూడా పెద్ద ప్రమాదంగా మారుతున్నాయి. కొన్ని యాప్స్ భారీ క్యాష్‌బ్యాక్‌లు లేదా బహుమతులు ఇస్తామని చెప్పి వినియోగదారులను ఆకర్షిస్తాయి. కానీ వీటిలో చాలా ఫిషింగ్ యాప్స్‌గా ఉండి, బ్యాంక్ వివరాలు లేదా ఓటీపీని దొంగిలించే ప్రయత్నం చేస్తాయి. సెక్యూరిటీ అప్డేట్లు లేని పాత యాప్స్ కూడా సమస్యలకు దారితీయవచ్చు. చాలా కాలంగా అప్డేట్ చేయని యాప్స్‌లో భద్రతా లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. హ్యాకర్లు ఈ లోపాలను ఉపయోగించి ఫోన్‌లోకి చొరబడే ప్రమాదం ఉంది.

అందువల్ల వినియోగదారులు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు దాని డెవలపర్ వివరాలు, రివ్యూలు, అనుమతులను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం లేని యాప్స్‌ను తొలగించడం, ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం, అధికారిక యాప్ స్టోర్ల నుంచే యాప్స్ డౌన్‌లోడ్ చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చని వారు చెబుతున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి అదృష్టం కలిసొస్తుంది
రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి అదృష్టం కలిసొస్తుంది
నాన్న చనిపోవడానికి కారణమిదే.. ప్రదీప్ రావత్ కుమారుడు ఎమోషనల్
నాన్న చనిపోవడానికి కారణమిదే.. ప్రదీప్ రావత్ కుమారుడు ఎమోషనల్
పల్లెలోనే కాదు.. నగరాల్లోనూ కొండ చిలువల హల్చల్!
పల్లెలోనే కాదు.. నగరాల్లోనూ కొండ చిలువల హల్చల్!
లైఫ్‌లో రిస్క్ తీసుకోవాలంటే.. 'గట్స్' ఉండాలి: IAS స్మితా సబర్వాల్
లైఫ్‌లో రిస్క్ తీసుకోవాలంటే.. 'గట్స్' ఉండాలి: IAS స్మితా సబర్వాల్
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం..
ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం..
శివలింగం, జ్యోతిర్లింగం ఒకటేనా? రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఇదే!
శివలింగం, జ్యోతిర్లింగం ఒకటేనా? రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఇదే!
15 ఏళ్లకే కోట్ల సంపాదన.. మరి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలా?
15 ఏళ్లకే కోట్ల సంపాదన.. మరి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలా?
జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.. అసలు సమస్య మీ పొట్టలోనే ఉందేమో..
జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.. అసలు సమస్య మీ పొట్టలోనే ఉందేమో..
తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా.. అప్పుడే ఓటీటీలోకి 'జన నాయగన్'!
తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా.. అప్పుడే ఓటీటీలోకి 'జన నాయగన్'!