Smartphone: రూ.30 వేల లోపు ముచ్చటైన స్మార్ట్ ఫోన్ ఇదే.. ఫీచర్ల విషయంలో తగ్గేదేలే..!
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. చాలా మంది ఖర్చుతో పని లేకుండా సూపర్ ఫీచర్లతో వచ్చే స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజైన సామ్‌సంగ్ రిలీజ్ గెలాక్సీ ఎం 56, వివో వీ 50ఈ ఫోన్లు కొనుగోలుకు యువత ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఈ రెండు ఫోన్ల మధ్య ప్రధాన తేడాలను తెలుసుకుందాం.

వివో వీ50ఈ డిజైన్‌ను యువత అమితంగా ఇష్టపడుతున్నారు. అలాగే ఈ ఫోన్ ప్రత్యేకమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్లాస్టిక్ బిల్డ్ ఉన్నప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్ దుమ్ము, నీటి రక్షణ కోసం ఐపీ 68, ఐపీ 69 రేటింగ్‌ను అందిస్తుంది. మరోవైపు సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 56 5జీ ఫోన్ మెటల్ బాడీ, సన్నని బెజెల్స్‌తో ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌ను కలిగి ఉంది. వెనుకవైపు ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే స్మార్ట్‌ఫోన్‌కు ఐపీ రేటింగ్ లేదు. డిస్‌ప్లే విషయానికొస్తే గెలాక్సీ ఎం 56 5జీ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల సూపర్ ఎమోఎల్ఈడీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే విజన్ బూస్టర్ టెక్నాలజీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తుంది.
మరోవైపు వివో వీ 50ఈ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. పనితీరు విషయానికొస్తే సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 56 ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే 8 జీబీ 256 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. వివో వీ 50ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో 8 జీబీ + 256 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ ఎం56 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులో ఉంటే వివో వి 50 ఈ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5600 ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది.
కెమెరా విషయానికి వస్తే గెలాక్సీ ఎం 56 5జీ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్ సపోర్ట్‌తో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపీ మాక్రో లెన్స్ ఉన్నాయి. అలాగే వివో వీ 50 ఈలో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం గెలాక్సీ ఎం 56 లో 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అయితే వివో ఫోన్ 50 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.ధర విషయానికొస్తే సామ్‌సంగ్ గెలాక్సీ ఎం56 5జీ 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.27999 ప్రారంభ ధరకు లాంచ్ చేశారు. అయితే వివో వీ 50ఈ వేరియంట్ ధర అయితే రూ.28999గా ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








