Redmi A5: ఐఫోన్ లుక్.. బెస్ట్ ఫీచర్లు.. అతి తక్కువ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్
ఐఫోన్ ను పోలి ఉండే డిజైన్, మంచి బ్యాటరీ బ్యాకప్, ఆకట్టుకునే స్క్రీన్, ప్రముఖ బ్రాండ్, బెస్ట్ కెమెరా.. ఇన్ని ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. సాధారణంగా ఇలాంటి ఫోన్ కోసం సుమారు రూ.20 వేల కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సిందే. మన దేశంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలు అంత సొమ్మును కేటాయించలేని పరిస్థితి ఉంటుంది.

భారతీయులకు ప్రముఖ బ్రాండ్ రెడ్ మీ శుభవార్త చెప్పింది. కొత్త ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. పైన తెలిపిన ఫీచర్లన్నీ దీనిలో ఉన్నాయి. రెడ్ మీ ఏ5గా పిలవబడే ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.6,499 మాత్రమే. దీని ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం. రెడ్ మీ ఏ5 స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 16న మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. దీని డిజైన్ ఐఫోన్ 16కు దగ్గరగా ఉంటుంది. రెండు రకాల వేరియంట్లలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ కలిగిన వేరియంట్ రూ.6499కు, అలాగే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ కలిగిన రెండో వేరియంట్ రూ.7,499కు తీసుకురానున్నారు. ఇది పూర్తిగా బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్ సెట్. డ్యూడ్రాప్ స్లైల్ నాచ్ తో కూడిన 6.88 అంగుళాల హెచ్ డీ + స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇది 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో పాటు 240 హెచ్ జెడ్ టచ్ రెస్పాన్స్ రేటును అందిస్తుంది.
రెడ్ మీ ఏ5 స్మార్ట్ ఫోన్ లోని 5200 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రోజంతా చక్కగా వినియోగించుకోవచ్చు. యూఎస్ బీ టైప్ సీ పోర్టు ద్వారా 15 డబ్ల్యూ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. అలాగే అత్యంత వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే 32 ఎంపీ ప్రైమరీ సెన్సార్ తో కూడిన ఏఐ డ్యూయర్ రియర్ కెమెరా సిస్టమ్ అమర్చారు. సెల్పీలు, వీడియో చాట్ ల కోసం 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ లెన్స్ ఉంది. రెడ్ మీ కొత్త ఫోన్ కు రెండేళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్ లకు హామీ ఇస్తోంది. అలాగే నాలుగేళ్ల వరకూ భద్రతా ప్యాచ్ లను అందిస్తోంది. తద్వారా ఎక్కువ కాలం ఈ ఫోన్ వినియోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఐపీ 52 రేటింగ్, అదనపు భద్రత కోసం ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ బాగున్నాయి. అన్ని ప్రధాన రిటైల్ షాపుల్లో రెడ్ మీ ఏ5 ఫోన్ అందుబాటులో ఉంటుంది. జైసల్మేర్ గోల్డ్, జస్ట్ బ్లాక్, పుదుచ్చేరి బ్లూ అనే మూడు రకాల రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటుంది.
ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ అత్యంత ముఖ్యమైన కనీస అవసరంగా మారింది. గతంలో మనిషి కనీస అవసరాలుగా తిండి, బట్ట, ఇల్లు ఉండేవి. ఇప్పుడు వాటికన్నా ముందు స్థానానికి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఎందుకంటే ఫోన్ లేకుండా ఒక్కరోజు ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. ఆర్థిక లావాదేవీలు, వినోదంతో పాటు అన్ని పనులకు అవసరం అవుతుంది. తక్కువ ధరతో విడుదలైన రెడ్ మీ ఏ5 ఫోన్ కు మార్కెట్ లో మంచి ఆదరణ లభిస్తుందని కంపెనీ భావిస్తోంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








