Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioBharat Phone: స్మార్ట్ ఫోన్లకు ఏమాత్రం తీసిపోని ఫీచర్ ఫోన్లు ఇవి.. కేవలం రూ. 1,099కే కొనేయొచ్చు..

భారతీయ టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో ఒక ట్రెండ్ సెట్టర్. చవకైన ధరలకే ఇంటర్ నెట్ అందించడతో పాటు మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్ నెట్ సేవలను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాక అతి తక్కువ ధరలోనే 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసి, వాటిలోనే వాట్సాప్, యూ ట్యూబ్ యాప్స్ ను అందించింది. స్మార్ట్ ఫోన్ కు దీటుగా ఫీచర్లను జోడించింది. కాగా ఇప్పుడు మరో రెండు కొత్త ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది.

JioBharat Phone: స్మార్ట్ ఫోన్లకు ఏమాత్రం తీసిపోని ఫీచర్ ఫోన్లు ఇవి.. కేవలం రూ. 1,099కే కొనేయొచ్చు..
Jio Bharat V3 And V4
Follow us
Madhu

|

Updated on: Oct 16, 2024 | 4:47 PM

దేశంలో దిగ్గజ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో మరో రెండు కొత్త 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. మొబైల్ కాంగ్రెస్ 2024లో జియో భారత్ వీ3, వీ4 పేరిట వీటిని భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ. 1,099ప్రారంభ ధరతోనే ఈ ఫోన్లను తీసుకొచ్చింది. ఇప్పటికీ 2జీ బేసిక్ ఫోన్లు వాడుతున్న వారికి సులభంగా 4జీ వైపు మళ్లించేందుకు ఈ ఫోన్లు తీసుకొచ్చినట్లు జియో ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న జియో భారత్ వీ2 ఫోన్లు విజయవంతం కావడంతో ఇప్పుడు మరో రెండు ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కొత్త రెండు ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

జియో వీ3, వీ4 స్పెసిఫికేషన్లు..

జియో కొత్తగా లాంచ్ చేసిన జియో భారత్ వీ3, వీ4 ఫీచర్ ఫోన్లు 1000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. ఎక్స్ టర్నల్ స్టోరేజ్ ను 128జీబీ వరకూ విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్లు మొత్తం 23 భారతీయ భాషలకు సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్లలో మీరు జియో సిమ్ కార్డు మాత్రమే వినియోగించాలి. మీ సిమ్ ను మీరు రూ. 123తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్లో మీకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14జీబీ డేటా లభిస్తుంది. అంటే మిగతా టెలికం కంపెనీలతో పోల్చితే 40శాతం ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఈఫోన్లు దేశ వ్యాప్తంగా అన్ని స్టోర్లలోనూ అందుబాటులోకి వస్తాయి. ఆన్ లైన్ లో అయితే జియో మార్ట్, అమెజాన్లో కొనుగోలు చేయొచ్చు. వీటి ధరలు రూ. 1,099 నుంచి ప్రారంభమవుతాయి.

వీ3, వీ4 డిజైన్లు ఇలా..

జియో తీసుకొచ్చిన రెండు కొత్త ఫోన్లు డిజైన్ పాత ఫోన్ మాదిరిగానే ఉన్నా.. కొన్న కీలక మార్పులతో యువతరాన్ని ఆకర్షించేలా ఉన్నాయి. అతి తక్కువ ధరలోనే ప్రీమియం అనుభవాన్ని అందించేలా స్టైల్ సెంట్రిక్ గా వీటిని రిలయన్స్ తీర్చిదిద్దింది. పనితీరు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, స్టైల్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా దీనిని రూపొందించారు. నాణ్యతలోనూ ఎక్కడా వెనక్కి తగ్గకుండా వీటిని తీర్చిదిద్దారు. ఈ ఫోన్లోని జియో టీవీ ద్వారా 455 లైవ్ టీవీ చానళ్లను వీక్షించొచ్చు. మీకిష్టమైన కార్యక్రమాలు, వార్తా చానళ్లు, క్రీడలు, సినిమాలు వీటిలో అందుబాటులో ఉంటాయి. అలాగే పేమెంట్స్ కోసం జియో పే అందుబాటులో ఉంటుంది. దీనిలో ప్రత్యేకంగా జియో చాట్ అనే ప్రత్యేక యాప్ పరిచయం చేశారు. దీని ద్వారా వాట్సాప్ లాగే ఫొటో షేరింగ్, గ్రూప్ చాట్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..