Realme: రియల్ మీ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ ఫోన్స్‌.. తక్కువ ధరలో 108 ఎంపీ కెమెరా

రియల్‌ మీ11 5జీ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 18,999 కాగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 19,999గా ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆగస్టు 29వ తేదీ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. రియల్‌మీ 11 5జీ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 1,080x2,400 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో...

Realme: రియల్ మీ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ ఫోన్స్‌.. తక్కువ ధరలో 108 ఎంపీ కెమెరా
Realme 11 Smartphone
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 24, 2023 | 3:01 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఇటీవల బడ్జెట్‌ మార్గట్‌ను టార్గెట్ చేస్తూ కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. ఇప్పటికే పలు బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌లను లాంచ్‌ చేసిన రియల్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకొచ్చాయి. రియల్‌మీ 11 ఎక్స్‌, రియల్‌మీ 11 పేరుతో రెండు 5జీ ఫోన్‌లను తీసుకొచ్చారు. ఇంతకీ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

రియల్‌ మీ11 5జీ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 18,999 కాగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 19,999గా ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆగస్టు 29వ తేదీ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. రియల్‌మీ 11 5జీ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 1,080×2,400 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియా టెక్‌ 6100+ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్‌తో కూడిన రెయిర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఛార్జింగ్‌ విషయానికొస్తే ఇందులో 67 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక రియల్‌మీ 11ఎక్స్‌ 5జీ ఫోన్‌ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 14,999కాగా, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 15,999గా ఉంది. ఆగస్టు 30వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.72 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1,080×2,400 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

ఇక ఈ ఫోన్‌ 6ఎన్‌ఎమ్‌ మీడియా టెక్‌ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 33 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..