AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nokia Flip Phone: రెండు స్క్రీన్లతో సరికొత్త ఫ్లిప్ ఫోన్.. అతి తక్కువ ధరకే లాంచ్ చేసిన నోకియా.. పూర్తి వివరాలు ఇవి..

ఫ్లిప్ ఫోన్ మార్కెట్ 2021తో పోల్చితే 2022కి డబుల్ అయ్యిందని, 2023 ముగిసే నాటికి అది ఇంకా పెరుగుతుందని హెచ్ఎండీ గ్లోబల్ అంచనా వేస్తోంది. ఈ కొత్త నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ క్లామ్ షెల్ డిజైన్ తో వస్తుంది. దీనిలో 2.8 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. పెద్ద బటన్స్ ఉంటాయి. ఫోన్ స్లిమ్ గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. దీనిలో 1450 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ వస్తుంది.

Nokia Flip Phone: రెండు స్క్రీన్లతో సరికొత్త ఫ్లిప్ ఫోన్.. అతి తక్కువ ధరకే లాంచ్ చేసిన నోకియా.. పూర్తి వివరాలు ఇవి..
Nokia 2660 Flip Phone
Madhu
|

Updated on: Aug 24, 2023 | 12:28 PM

Share

ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్ల రాకతో దెబ్బతిన్న ప్రముఖ సెల్ ఫోన్ల బ్రాండ్ నోకియా తిరిగి పుంజుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు ఆండ్రాయిడ్ ఫోన్లను తీసుకొచ్చిన నోకియా.. ఇప్పుడు బేసిక్ కీబోర్డు మోడల్లోనే పాతకాలపు ఫ్లిప్ ఫోన్లను ఇటీవల లాంచ్ చేసింది. 4జీ కనెక్టివిటీతో తీసుకొచ్చిన ఈ నోకియా ఫోన్లు తక్కువ ధరకే లభ్యమవుతుండటంతో వినియోగదారులను ఆకర్షిస్తాయని కంపెనీ విశ్వసిస్తోంది. హెచ్ఎండీ గ్లోబల్ దీనిని నోకియా 2660 పేరుతో ఆవిష్కరించింది. పాప్ పిక్, లష్ గ్రీన్ కలర్ వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. వీటికి బ్లాక్, రెడ్, బ్లూ కలర్స్ ను జోడించింది. ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

డబుల్ అయిన మార్కెట్ షేర్..

ఫ్లిప్ ఫోన్ మార్కెట్ 2021తో పోల్చితే 2022కి డబుల్ అయ్యిందని, 2023 కి అది ఇంకా పెరుగుతుందని హెచ్ఎండీ గ్లోబల్ అంచనా వేస్తోంది. ఈ కొత్త నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ క్లామ్ షెల్ డిజైన్ తో వస్తుంది. దీనిలో 2.8 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. పెద్ద బటన్స్ ఉంటాయి. ఫోన్ స్లిమ్ గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. దీనిలో 1450 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ వస్తుంది. ఈ నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ క్లియర్ కాల్ క్లారిటీని అందిస్తుంది. దీని కోసం వాల్యూమ్ సెట్టింగ్స్ ను అడ్జస్ట్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. దీనిలో హియరింగ్ అండ్ కాంపాటబుల్(హెచ్ఏసీ) ఫీచర్ ఉంటుంది. దీంతో కాల్స్ ఎటువంటి డిస్టార్షన్స్ లేకుండా మాట్లాడవచ్చు.

నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్లు..

ఈ ఫోన్లో 2.8-అంగుళాల (320 x 240 పిక్సెల్‌లు) క్యూవీజీఏ డిస్‌ప్లే, 1.77 అంగుళాల(160 x 128 పిక్సెల్‌లు) క్యూక్యూ వీజీఏ సెకండరీ డిస్‌ప్లే ఉంటాయి. 1జీహెర్జ్ వరకు యూనీసోక్ టీ107 సింగిల్-కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 48ఎంబీ ర్యామ్, 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డుతో 32జీబీ వరకు మెమరీని విస్తరించుకోవచ్చు. డ్యూయల్ సిమ్ (నానో + నానో) స్లాట్స్ ఉంటాయి. ఎస్30 ప్లస్ ఓఎస్ పై ఆధారపడి పనిచేస్తుంది. వీజీఏ వెనుకవైపు కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్ వస్తాయి. 4జీ VoLTE కనెక్టివీటీ , బ్లూటూత్ 4.2, మైక్రో యూఎస్బీ 2.0 ఉంటాయి. 2జీలో 20 గంటలు, 4జీలో 6.5 గంటల వరకు టాక్ టైమ్‌ అందించే 1450ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ దీనిలో వస్తుంది.

ధర, లభ్యత..

నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో లభిస్తోంది. పాప్ పింక్, లష్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్, నోకియా అధికారిక వెబ్ సైట్లో 2023 ఆగస్టు 24 నుంచి కొనుగోలు చేయొచ్చు. దీన ధర రూ. 4,699గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!