Realme C61: మార్కెట్లోకి మరో బడ్జెట్‌ ఫోన్‌.. రూ. 7500కే 32 ఎంపీ కెమెరా..

మార్కెట్లోకి వరుసగా బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌లు లాంచ్‌ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా రూ. 10వేల బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన పలు స్మార్ట్ ఫోన్‌ కంపెనీలు బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకురాగా తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ సీ61 పేరుతో...

Realme C61: మార్కెట్లోకి మరో బడ్జెట్‌ ఫోన్‌.. రూ. 7500కే 32 ఎంపీ కెమెరా..
Realme C61
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 28, 2024 | 4:19 PM

మార్కెట్లోకి వరుసగా బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌లు లాంచ్‌ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా రూ. 10వేల బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన పలు స్మార్ట్ ఫోన్‌ కంపెనీలు బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకురాగా తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ సీ61 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..

చైనాకుచెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి రియల్‌మీ సీ61 పేరుతో బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,699కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8,999గా, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8,499గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ సైతం లభించనుంది.

ఇక రియల్‌మీ సీ61 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే. ఇందులో.. 6.78 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 90Hz రీఫ్రెష్‌ రేటు, 450 నిట్స్‌ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో యూనిసాక్‌ టీ612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

కనెక్టివిటీ విషయానికొస్తే రియల్‌మీ సీ61 ఫోన్‌లో వైఫై 2.4GHz / 5GHz, బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఇక బ్యాటపరంగా చూస్తే ఇంఉదలో 10 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. అయితే ఈ ఫోన్‌ 4జీ నెట్‌వర్క్‌కి మాత్రమే పనిచేస్తుంది. ఇక రియల్‌మీ సీ61 ఫోన్‌ను సఫారీ గ్రీన్‌, మార్బుల్‌ బ్లాక్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..