AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme 10T 5G: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు.. రియల్‪మీ నుంచి కొత్త 5జీ ఫోన్.. లుక్ అదిరిపోయిందిగా..

రియల్ మీ తన కొత్త 5జీ ఫోన్ రియల్ మీ 10టీ 5జీ(Realme 10T 5G)ని ఆవిష్కరించింది. ఇది మీడియా టెక్ డైమెన్ సిటీ 810 ప్రాసెసర్ తో పాటు 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Realme 10T 5G: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు.. రియల్‪మీ నుంచి కొత్త 5జీ ఫోన్.. లుక్ అదిరిపోయిందిగా..
Realme 10t 5g
Madhu
|

Updated on: Mar 24, 2023 | 12:30 PM

Share

ప్రస్తుతం అంతా 5జీ ట్రెండ్ నడుస్తోంది. అన్ని చోట్లా 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి రావడంతో జనాలు కూడా 5జీ ఫోన్లు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అందుకు తగ్గట్లుగానే అన్ని స్మార్ట్ ఫోన్ల కంపెనీలు తమ ఉత్పత్తులనను 5జీ వేరియంట్లో లాంచ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే రియల్ మీ తన కొత్త 5జీ ఫోన్ రియల్ మీ 10టీ 5జీ(Realme 10T 5G)ని ఆవిష్కరించింది. ఇది మీడియా టెక్ డైమెన్ సిటీ 810 ప్రాసెసర్ తో పాటు 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతానికి ఇండోనేషియాలో మాత్రమే ఇది లభ్యమవుతోంది. దీని ధర కూడా అందుబాటులో ఉంది. త్వరలోనే మన దేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్లు ఇవి..

రియల్ మీ 10టీ 5జీ ఫోన్ లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఐసీఎస్ ఎల్సీడీ ప్యానల్ ఉంటుంది. 90Hz రిఫ్రెష్మెంట్ రేటు ఉంటుంది. దీనిలో వాటర్ డ్రాప్ నాట్చ్ కలిగిన 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమరాతో పాటు రెండు 2ఎంసీ సెకండరీ కెమెరాలు ఉంటాయి. అంతేకకాక మీడియా టెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ సామర్థ్యంతో పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. టైప్ సీ చార్జింగ్ పోర్టు ఉంటుంది.

ధర, కలర్స్..

రియల్ మీ 10టీ 5జీ రెండు వేరియంట్లలో అందబాటులో ఉంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యాలతో వస్తోంది. 4జీబీ వేరియంట్ 6,999 టీహెచ్బీ ఉంటుంది. మన కరెన్సీలో దాదాపు రూ. 16,000. అలాగే 8జీబీ వేరియంట్ టీహెచ్బీ 8,999, మన కరెన్సీలో రూ. 21,000 వరకూ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ బ్లాక్, డ్యాష్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్