Best Smartphone: పవర్ లేదనే టెన్షన్ లేదు…ఈ స్మార్ట్ ఫోన్ కేవలం పది నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది.
ఇప్పటి వరకు ఎన్నో స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో విడుదలయ్యాయి. అయితే Infinix బడ్జెట్ ధరలలో స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేయడంలో ప్రజాదరణ పొందింది. ఇప్పుడు Infinix కంపెనీ 260W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి రెడీగా ఉంది.
ప్రముఖ టెక్ బ్రాండ్ Infinix తక్కువ ధరలకు హై క్వాలిటీ గల స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేయడం ద్వారా ప్రజాదారణ పొందింది. ఈ కంపెనీ అధునాతన సాంకేతికత, అద్భుతమైన డిజైన్లతో ఫోన్‌లను తయారు చేస్తుంది. ఇటీవల, కంపెనీ 260వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ను ఇప్పటి వరకు ఏ మొబైల్ కంపెనీ కూడా ప్రారంభించలేదు. 260వాట్స్ Infinix ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జ్ అవుతుంది. రాబోయే Infinix GT 10ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఈ సరికొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించాలని కంపెనీ యోచిస్తోందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.
కాగా Infinix గతంలో 180వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఇప్పుడు కొత్త 260W ఛార్జింగ్ సామర్థ్యాన్ని త్వరలో అందించడానికి సిద్ధంగా ఉంది. Infinix ఇటీవల 110వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యంతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కూడా పరిచయం చేసింది. ఈ కొత్త 110వాట్స్ వైర్‌లెస్ ఛార్జర్‌లు 16 నిమిషాల్లో ఫోన్‌ను 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేస్తాయి. ఇది GT 10 ప్రోలో అందించబడే అవకాశం ఉంది. Infinix GT 10 ప్రో 5000ఏంఎహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుందని ఓ రిపోర్టులో వెల్లడించింది.
కంపెనీ కొన్ని రోజుల క్రితం 260వాట్స్ ఛార్జింగ్ అడాప్టర్‌తో 4400ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించి ఛార్జింగ్ టెక్నాలజీని ప్రదర్శించింది. ఆ ఛార్జింగ్ టెక్నాలజీతో, 4400ఎంఏహెచ్ బ్యాటరీ 8 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది. అంటే రాబోయే GT 10 ప్రో మొబైల్‌ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం పది నిమిషాలు సరిపోతుందన్నమాట. రియల్మీ ఇటీవల తన GT 3 ఫోన్‌లో 240వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. అయితే ఇన్ఫినిక్స్ ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయబోతోంది.
Infinix GT 10 ప్రో ఫీచర్లు:
ఫ్లాగ్‌షిప్ మోడల్ GT 10 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని ఫీచర్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి, ఈ మొబైల్ 6.8 అంగుళాల 120Hz AMOLED డిస్ప్లే, 12జిబి ర్యామ్ ప్లస్ 256జిబి స్టోరేజీ . మీడియా టెక్. డైమెన్షన్ 9000 ప్రాసెసర్‌తో ప్రారంభం కానుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..