Electric Scooter: గంటకు 100 కి.మీ.ల వేగం.. సింగిల్ చార్జ్ పై 200 కి.మీ.ల దూరం.. రెట్రో లుక్‪లో అదరగొడుడున్న కొత్త స్కూటర్..

స్పానిష్ బ్రాండ్ నెక్ట్స్ ఎలక్ట్రిక్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దాని పేరు మోజిటో. ఇది సాధారణ పెట్రోల్ ఇంజిన్ 125సీసీ సమానమైన పనితీరును కలిగి ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. 

Electric Scooter: గంటకు 100 కి.మీ.ల వేగం.. సింగిల్ చార్జ్ పై 200 కి.మీ.ల దూరం.. రెట్రో లుక్‪లో అదరగొడుడున్న కొత్త స్కూటర్..
Mojito Electric Scooter
Follow us
Madhu

|

Updated on: Mar 23, 2023 | 4:00 PM

స్పానిష్ బ్రాండ్ నెక్ట్స్ ఎలక్ట్రిక్ మోటార్స్ కు ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కంపెనీ 2017 ప్రారంభమైనప్పటి నుంచి అత్యాధునిక సదుపాయలతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, అనువైన బడ్జెట్లో అందిస్తుందన్న పేరు గడించింది. ఈ క్రమంలో ఇటీవల ఆ కంపెనీ ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దాని పేరు మోజిటో. ఇది సాధారణ పెట్రోల్ ఇంజిన్ 125సీసీ సమానమైన పనితీరును కలిగి ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, రేంజ్, లుక్, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం..

రెట్రో స్టైల్..

కొత్త మోజిటో ఎలక్ట్రిక్ స్కూటర్ రెట్రో స్టైల్ లో ఉంటుంది. క్లాసిక్, అలాగే సమకాలీన అంశాలను జోడించి దీనిని తయారు చేశారు. దీనిలో స్ట్రైప్ టైర్లు, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానల్ వంటి సదుపాయాలు ఉంటాయి.

గంటకు 100 కిలోమీటర్ల వేగం..

మోజిటో ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.5kW సామర్థ్యంతో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 4.6kW శక్తని ఉత్పత్తి చేయగలుతుంది. ఇది 125సీసీ పెట్రోల్ ఇంజిన్ తో సమానంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. దీనిలో రెండు బ్యాటరీ ఉంటాయి. ఒక్కో 24 కేజీల బరువు ఉంటాయి. ఈ రెండు బ్యాటరీలు ఫుల్ చార్జ్ అవడానికి రెండు గంటలు సమయం పడుతుంది. ఒక్కో బ్యాటరీ ఫుల్ చార్జ్ అయితే 100 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తాయి. దీనిలో 12 అంగుళాల మందంతో చక్రాలు ఉంటాయి. టీఎఫ్టీ ప్యానల్, సీటు కింద ఏదైనా వస్తువులు పెట్టుకునేందుకు అనువైన స్థలం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..