Electric bicycle: ఏసర్ ఆటోమేటిక్ సైకిల్ ఇదే.. సింగిల్ చార్జ్ పై 110 కిలోమీటర్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అంతే!
ఏసర్ ఇప్పటి వరకూ ల్యాప్ టాప్ ల తయారీలోనే పేరుగడించింది. అయితే ఇప్పుడు పట్టణ ప్రజల సౌకర్యార్థం ఓ ఎలక్ట్రిక్ సైకిల్ ని తీసుకొచ్చింది. ఏసర్ ఈబీ ఎలక్ట్రిక్ బైస్కిల్(ebii electric bicycle) పేరుతో తన మొదటి ఉత్పత్తిని ఆవిష్కరించింది.
ప్రస్తుత ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. చిన్న చిన్న స్టార్టప్ ల దగ్గర నుంచి దిగ్గజ కంపెనీలు కూడా ఈ-బాట పడుతున్నాయి. జియోమీ వంటి స్మార్ట్ ఫోన్ల కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించింది. ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ ఏసర్(Acer) కూడా చేరింది. ఏసర్ ఇప్పటి వరకూ ల్యాప్ టాప్ ల తయారీలోనే పేరుగడించింది. అయితే ఇప్పుడు పట్టణ ప్రజల సౌకర్యార్థం ఓ ఎలక్ట్రిక్ సైకిల్ ని తీసుకొచ్చింది. ఏసర్ ఈబీ ఎలక్ట్రిక్ బైస్కిల్(ebii electric bicycle) పేరుతో ఎలక్ట్రిక్ మొబలిటీ ప్రపంచంలో తన మొదటి ఉత్పత్తిని ఆవిష్కరించింది. డిజైన్, సాంకేతికత రెండింటిలోనూ ఎక్కడా రాజీ పడకుండా.. మంచి ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ సైకిల్ ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అధునాతన ఏఐ టెక్నాలజీతో..
ఈ విద్యుత్ శ్రేణి సైకిల్లో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉంది. అయితే దీనిని పూర్తిగా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ అని అనలేముగాని.. దీనిలో అంతర్మీతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉంటుంది. దీని ఆధారంగానే ఈ సైకిల్ పనిచేస్తుంది. ఇది ఎదురొస్తున్న వస్తువులు, నేలపై ఉన్న వస్తువులను సెన్సార్ ల ద్వారా పసిగట్టి బైక్ ని కంట్రోల్ చేస్తుంది. ఫలితంగా రైడర్ కి సేఫ్ జర్నీని అందిస్తుంది.
సూపర్ ఫీచర్లు..
ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఆటోమేటిక్ లాక్ సిస్టం ఉంటుంది. బైక్ వదిలి వెళ్లిననప్పుడు ఆటోమేటిక్ గా ఇది లాక్ అయిపోతోంది. మళ్లీ ఫోన్ లోని యాప్ ద్వారా అన్ లాక్ అవుతుంది. యాప్ ఉన్న ఫోన్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. అలాగే బిల్ట్ ఇన్ జీపీఎస్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇది బైక్ లోకేషన్ ట్రాక్ చేయడానికి ఉపకరిస్తుంది. 365 రోజులూ, 24 గంటలూ దీనిని ట్రాక్ చేయొచ్చు. అందువల్ల దీనిని ఎవరూ దొంగిలించలేరు. దొంగిలించినా దానిని మీరు ట్రాక్ చేయొచ్చు.
సామర్థ్యం ఇలా..
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో 250 వాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గంటకు గరిష్టంగా 15 మైళ్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఆసియా, యూరోప్ లలోని ఈ బైక్ రెగ్యూలేషన్స్ ఆధారంగా దీనిని రూపొందించారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో 460 వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంది. సింగిల్ చార్జ్ పై 68 మైళ్ల వరకూ ప్రయాణించగలుగుతుంది. ఈ బ్యాటరీని పవర్ బ్యాంక్ తో కూడా చార్జ్ చేసుకోవచ్చు.
ధర ఎంతంటే..
ఏసర్ కంపెనీ దీని ధరను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఏసర్ అధికారిక వెబ్ సైట్ సందర్శించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..