Realme C33 : మరో కొత్త ఫోన్ రిలీజ్ చేసిన రియల్‌మీ.. ఫీచర్స్ చూస్తే వావ్ అంటారంతే..!
ఈ కోవలోనే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ సంస్థ కొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. రియల్ మీ సీ 33 పేరుతో రిలీజ్ చేసిన ఫోన్ అన్ని అధునాతన ఫీచర్లతో పాటు 5జీ సపోర్ట్‌తో వినియోగదారులను అలరిస్తుంది.
భారత్‌లో ఉన్న స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ మొబైల్ కంపెనీలు కొత్త మోడ్సల్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా అధునాతన ఫీచర్లను జోడిస్తూ మార్కెట్‌లో ఈ కొత్త ఫోన్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కోవలోనే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ సంస్థ కొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. రియల్ మీ సీ 33 పేరుతో రిలీజ్ చేసిన ఫోన్ అన్ని అధునాతన ఫీచర్లతో పాటు 5జీ సపోర్ట్‌తో వినియోగదారులను అలరిస్తుంది. ఈ ఫోన్‌లోని 4 జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.9999 కాగా, 4జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.10499గా ఉంది. ఫోన్ ఆక్వా బ్లూ, నైట్ సీ, శాండీ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తున్నారు.
రియల్‌మి సీ33 ఫీచర్లు ఇవే..
- 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
- యూనిఎస్ఓసీ టీ612 చిప్‌సెట్ ఎంఏఐ జీ57 జీపీయూ గ్రాఫిక్ కార్డ్
- 4జీబీ + 64జీబీ, 4జీబీ + 128జీబీ రెండు వేరియంట్లు
- ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ ఎస్ ఆధారితం
- 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెన్సార్లు
- 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
- సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 10వాట్స్ స్టాండర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం