AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Charging: పబ్లిక్ ప్రదేశాల్లో మొబైల్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ పని ఖతమే..

మన మొబైల్ భద్రతను మనం నిర్లక్ష్యం చేయకూడదు. పబ్లిక్ ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టడం వల్ల సైబర్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. దీని ద్వారా మీ వ్యక్తిగత సమాచారం, డేటా నష్టం జరగవచ్చు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రోలలో మొబైల్ ఛార్జింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది చూద్దాం.

Mobile Charging: పబ్లిక్ ప్రదేశాల్లో మొబైల్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ పని ఖతమే..
Mobile Charging
Venkatrao Lella
|

Updated on: Oct 04, 2026 | 7:47 PM

Share

మొబైల్ ఫోన్లు మన జీవితంలో ఒక అంతర్భాగంగా మారాయి. నేటి ప్రపంచంలో మొబైల్ లేకుండా జీవించడం అసాధ్యమనే చెప్పాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్‌తో ఏదోక పని ఉంటుంది. కొంతమంది అయితే ఎప్పుడూ ఫోన్‌తోనే సమమం గడుపుతూ ఉంటారు. ఆఫీస్ వర్క్, బిజినెస్ అవసరాల కోసం ఫోన్ మరింతగా ఉపయోగించాల్సి ఉంటుది. దీంతో మన వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు, జ్ఞాపకాలు అన్నీ మొబైల్‌లోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఈ కారణంతో ఫోన్‌లోని సమాచారం ఇతరులకు లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న పొరపాటు చేసినా మీ వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కవచ్చు. ముఖ్యం పబ్లిక్ ప్రదేశాల్లో మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టుకునేముంద చాలా జాగ్రత్తగా ఉండాలి. రైల్వే స్టేషన్, బస్టాండ్, బస్టాఫ్, మెట్రో స్టేషన్లు, మెట్రోలలో ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణాలు చేసే సమయంలో వీటిని ఉపయోగించి చాలామంది తమ మొబైల్‌ను ఛార్జ్ చేసుకుంటారు. ఇలాంటి సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

జ్యూస్ జాకింగ్ మోసాలు..

ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాల్లో, తెలియని ఛార్జింగ్ పాయింట్‌లలో మొబైల్‌ను ఛార్జ్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. బయటి ప్రదేశాల్లో ఛార్జింగ్ చేయడం వల్ల మొబైల్‌లోని డేటాకు భద్రత ఉండదని, సమాచారం సులభంగా ఇతరుల చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నా. “డేటా జాకింగ్” లేదా “జ్యూస్ జాకింగ్” అని ప్రక్రియ ద్వారా హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు మీ మొబైల్లోని సమాచారాన్ని యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్‌ల ద్వారా సేకరించే ప్రమాదముంది. మొబైల్‌ను ఛార్జింగ్ కోసం కనెక్ట్ చేసినప్పుడు తెలియకుండానే మీ డివైజ్ నుండి డేటా బదిలీ కావచ్చు.  దీంతో మన విలువైన డేటాను కోల్పోకుండా ఉండాలంటే.. బయటి ప్రదేశాల్లో మొబైల్ ఛార్జింగ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మన మొబైల్ భద్రత మన చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ అత్యవసరమై చార్జింగ్ పెట్టుకోవాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి..?

అత్యవసరం అయితే తప్ప బహిరంగ ప్రదేశాలలో లభించే USB ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగించవద్దు. ప్రయాణాలలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఒక పవర్‌బ్యాంక్‌ను వెంట ఉంచుకోవడం ఉత్తమం. మీ సొంత ఛార్జర్‌ను ఉపయోగించి  ప్లగ్ పాయింట్లలో ఛార్జ్ చేయడం సురక్షితం. అత్యవసర పరిస్థితుల్లో పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్‌ను ఉపయోగించాల్సి వస్తే, ఛార్జింగ్‌కు పెట్టే ముందు మీ మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు డేటా బదిలీ జరగదు.  మీ ఫోన్ డేటా షేరింగ్ సెట్టింగ్‌లను తనిఖీ చేసి, అనవసరమైన వాటిని డిసేబుల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us
పబ్లిక్ ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టుకునేవారు జాగ్రత్త.. ఈ తప్పులు
పబ్లిక్ ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టుకునేవారు జాగ్రత్త.. ఈ తప్పులు
తాళం చెవి పోయిందా? లాక్‌ పగలగొట్టకుండానే తెరిచే సులభమైన చిట్కాలు!
తాళం చెవి పోయిందా? లాక్‌ పగలగొట్టకుండానే తెరిచే సులభమైన చిట్కాలు!
ఉల్లిపాయ కట్‌చేసినప్పుడు కన్నీళ్లు ఎందుకొస్తాయో తెలుసా?
ఉల్లిపాయ కట్‌చేసినప్పుడు కన్నీళ్లు ఎందుకొస్తాయో తెలుసా?
గ్యాస్ సిలిండర్లపై రూ.300 సబ్సిడీ.. కేంద్రం శుభవార్త
గ్యాస్ సిలిండర్లపై రూ.300 సబ్సిడీ.. కేంద్రం శుభవార్త
అరటిపండు ఫేస్ మాస్క్..నల్లటి మచ్చలు తగ్గి,చర్మం మెరిసిపోయేలా చేసే
అరటిపండు ఫేస్ మాస్క్..నల్లటి మచ్చలు తగ్గి,చర్మం మెరిసిపోయేలా చేసే
ఒకే మొక్కకు 4 వేల పూలు.. జడ్చర్లలో ప్రకృతి వింత..
ఒకే మొక్కకు 4 వేల పూలు.. జడ్చర్లలో ప్రకృతి వింత..
ఫిట్‌నెస్ లేక పక్కకు తప్పుకున్న హార్దిక్
ఫిట్‌నెస్ లేక పక్కకు తప్పుకున్న హార్దిక్
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ