Zoom Live Translation: ఇకపై భావ వ్యక్తీకరణకు భాష అడ్డం కాదు.. లైవ్ ట్రాన్స్‌లేషన్‌పై దృష్టి సారించిన జూమ్..
Zoom Live Translation: కరోనా తదనంతర నేపథ్యంలో ఆన్‌లైన్ మీటింగ్‌లకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. లాక్‌డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరగడంతో ఉద్యోగులు, స్కూళ్లు మూత పడడంతో విద్యార్థులు సైతం..
Zoom Live Translation: కరోనా తదనంతర నేపథ్యంలో ఆన్‌లైన్ మీటింగ్‌లకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. లాక్‌డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరగడంతో ఉద్యోగులు, స్కూళ్లు మూత పడడంతో విద్యార్థులు సైతం ఆన్‌లైన్ వేదికగానే వర్చువల్‌గా మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ సాఫ్ట్‌వేర్ జూమ్ యూజర్లను ఆకట్టుకునే క్రమంలో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. సహజంగా మనం ఏదైనా ఆన్‌లైన్ మీటింగ్‌లో పాల్గొన్న సమయంలో మనకు తెలియని భాషలో ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్‌పెట్టడానికే జూమ్ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. వేర్వేరు భాషలకు చెందిన వారు ఇబ్బందిలేకుండా సమచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకుగాను ఈ కొత్త టెక్నాలజీని తీసుకురానున్నారు. ఇందులో భాగంగానే ఎదుటి వ్యక్తి మాట్లాడుతుండగానే మనకు నచ్చిన భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసే టెక్నాలజీలో తనదైన ముద్ర వేస్తోన్న జర్మనీకి చెందిన కైట్స్ అనే సంస్థను జూమ్ కొనుగోలు చేసింది. కైట్స్ సంస్థకు సంబంధించిన టెక్నాలజీని ఉపయోగించుకొని వర్చువల్ మీటింగ్స్‌ను మరింత సులభతరం చేయనున్నామని జూమ్ చెబుతోంది. ఇదిలా ఉంటే ఆన్‌లైన్ మీటింగ్ ఇతరులు మాట్లాడుతున్న భాషను మనకు నచ్చిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసే ఫీచర్‌ను జూమ్ ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చింది. అయితే కొన్ని స్థానిక భాషలు, వారి యాసను అర్థం చేసుకొని ట్రాన్స్‌లేట్ చేయడంలో ఈ ఫీచర్ మెరుగైన ఫలితాన్ని అందించడం లేదు దీంతో ఈ సమస్యను అధిగమించి మరింత మెరుగైన సేవలను అందించడానికే కైట్స్‌ను టేక్ ఓవర్ చేసినట్లు జూమ్ ప్రతినిధులు చెబుతున్నారు.
Twitter Down : ట్విట్టర్ సేవలకు అంతరాయం.. సరిగా పనిచేయడం లేదని వినియోగదారుల ఆందోళన..
Google: గూగుల్‌కు 27,700 ఫిర్యాదులు.. 59వేల కంటెంట్ల తొలగింపు.. నెలవారీ నివేదిక విడుదల