Zoom Video Call: జూమ్ వీడియో కాల్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై బ్యాక్‌గ్రౌండ్ మీకు నచ్చినట్లు..
Zoom Call New Feature: కరోనా కారణంగా ఆన్‌లైన్‌కు బాగా డిమాండ్ పెరిగింది. ఇంటర్వ్యూల నుంచి తరగతుల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే మారిపోయింది. చివరికి ఒకటో తరగతి చిన్నారి కూడా జూమ్ కాల్‌లో క్లాసులు వినే...
Zoom Call New Feature: కరోనా కారణంగా ఆన్‌లైన్‌కు బాగా డిమాండ్ పెరిగింది. ఇంటర్వ్యూల నుంచి తరగతుల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే మారిపోయింది. చివరికి ఒకటో తరగతి చిన్నారి కూడా జూమ్ కాల్‌లో క్లాసులు వినే రోజులు వచ్చేశాయి. అయితే జూమ్ వీడియో కాల్స్ చేసే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ సరిగా ఉండక కొందరు ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. అలా కాకుండా మీరు వీడియో కాల్‌లో మాట్లాడుతున్న సమయంలో మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ను సెట్ చేసుకునే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ..
అచ్చంగా ఇలాంటి ఆలోచన చేశారు జూమ్ డెవలపర్స్. ఇమ్మర్సివ్ వ్యూ పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సహాయంతో మీ బ్యాక్‌గ్రౌండ్‌ను మీకు నచ్చినట్లు సెట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థులు తరగతి గదిలో కూర్చున్నట్లు, ఉద్యోగులైతే ఆఫీసుల్లో ఉన్నట్లు సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఇతర దేశాల్లో ఉన్న జూమ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ను సెట్ చేసుకునే అవకాశం ఉన్నా.. దాన్ని కేవలం సమావేశాన్ని ఏర్పాటు చేసే హోస్ట్‌కు మాత్రమే అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను డెస్క్‌టాప్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మొబైల్‌లోనూ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం విదేశాల్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను భారత్‌లోనూ తీసుకురానున్నట్లు జూమ్ ప్రతినిధులు చెబుతున్నారు.
Also Read: మీ ఏటీఎం కార్డు పోయిందా..? అయితే వెంటనే ఇలా చేయండి..! లేదంటే చాలా నష్టపోతారు..
Ice Age: స్విమ్మింగ్ పూల్ కోసం భూమి తవ్వితే బయటపడిన ఎముకలు..షాక్ తిన్న యజమాని..పోలీసులు ఏమన్నారంటే..