Oneplus Diwali Sale: ఈ దీపావళి వన్ ప్లస్‌తో మరింత దేదీప్యం.. అద్భుతమైన ఆఫర్లు.. అదిరే డిస్కౌంట్లు.. పూర్తి వివరాలు ఇవి..
ఇటీవల కాలంలో వన్ ప్లస్ గ్యాడ్జెట్లకు డిమాండ్ ఏర్పడింది. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి డివైజ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వన్ ప్లస్ కొనుగోలు దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో వన్ ప్లస్ దివాలి సేల్ ను ప్రారంభించింది. దీనిలో భాగంగా అత్యద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించిన బ్రాండ్ వన్ ప్లస్. మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కొంత కాలంలోనే టాప్ బ్రాండ్ గా ఎదిగింది. సాధారణంగా వన్ ప్లస్ డివైజ్ లు కాస్త ప్రీమియం ధరలో ఉంటాయి. వాటి పనితీరు కూడా అలానే ఉంటాయి. అందుకే ఇటీవల కాలంలో వన్ ప్లస్ గ్యాడ్జెట్లకు డిమాండ్ ఏర్పడింది. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి డివైజ్ లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వన్ ప్లస్ కొనుగోలు దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో వన్ ప్లస్ దివాలి సేల్ ను ప్రారంభించింది. దీనిలో భాగంగా అత్యద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, స్మార్ట్ టీవీలపై ఈ ఆఫర్లు ఉన్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు..
- వినియోగదారులు వన్ ప్లస్ ఓపెన్ ని కొనుగోలు చేస్తే రూ. 5000 వరకూ ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ పొందొచ్చు. అంతేకా పాత డివైజ్ ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 5000 వరకూ బోనస్ కూడా పొందొచ్చు.
- వినియోగదారులు వన్ ప్లస్ 11 5జీ, వన్ ప్లస్ మార్బల్ ఒడెస్సీ కొనుగోలుపై రూ. 3000 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందండి. రూ. 4,000 ప్రత్యేకమైన కూపన్ ద్వారా తగ్గింపు పొందొచ్చు.
- వినియోగదారులు వన్ ప్లస్ 115జీ ని 12నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. అలాగే మార్బల్ ఒడెస్సీ పై 18 నెలల కాల పరిమితితో నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంటుంది.
- వన్ ప్లస్ 11ఆర్ 5జీ, వన్ ప్లస్ 11ఆర్ 5జీ సోలార్ రెడ్ స్పెషల్ ఎడిషన్ పై రూ. 2,000 వరకూ ఇన్ స్టంట్ క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే వినియోగదారులు నో కాస్ట్ ఈఎంఐ ద్వారా 9 నెలల కాల వ్యవధిపై ఫోన్ ని కొనుగోలు చేయొచ్చు.
- వన్ ప్లస్ 10 ప్రో 5జీ, వన్ ప్లస్ 10టీ 5జీ ఫోన్లపై రూ. 5,000 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, అలాగే రూ. 14,000, రూ. 10,000 విలువైన ప్రత్యేక కూపన్లను పొందొచ్చు. 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంటుంది.
- అలాగే వన్ ప్లస్ 10ఆర్ 5జీ ఫోన్ కొనుగోలుపై రూ. 3000 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ. 7,000విలువైన ప్రత్యేకమైన కూపన్ అందుబాటులో ఉంటుంది. ఆరు నెలల కాలవ్యవధితో నో కాస్ట్ ఈఎంఐ పొందొచ్చు.
- ఈ కార్డు ఆఫర్లు ఐసీఐసీఐ బ్యాంక్ తో పాటు వన్ కార్డ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అయిన అమెజాన్, వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్స్, వన్ ప్లస్ డాట్ ఇన్ అలాే పలు ఆఫ్ లైన్ పార్టనర్ స్టోర్స్ ఉంటుంది.
వన్ ప్లస్ నోర్డ్ స్మార్ట్ ఫోన్స్..
- వినియోగదారులు వన్ ప్లస్ నోర్డ్ 3 5జీ కొనుగోలు పై ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ. 3000 పొందొచ్చు. అలాగే రూ. 3000 విలువైన ప్రత్యేక కూపన్ కూడా వస్తుంది. అదే విధంగా వన్ ప్లస్ నోర్డ్ 3 పై ఆరు నెలల కాల వ్యవధితో ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది.
- వినియోగదారులు వన్ ప్లస్ నోర్డ్ సీఈ3పై రూ. 2000 తక్షణ బ్యాంక్ తగ్గింపు లభిస్తుంది. అలాగే రూ. 2,500 విలువైన ప్రత్యేక కూపన్ కూడా లభిస్తుంది.
- వన్ ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్, వన్ ప్లస్ నోర్డ్ సీఈ2 లైట్ ఫోన్లు కొనుగోలు చేసే కస్టమర్‌లు అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్‌తో తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ రూ. 1,500 పొందవచ్చు. కస్టమర్‌లు 3 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ కూడా పొందొచ్చు.
- వినియోగదారులు పై ఆఫర్లు ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్ లపై మాత్రమే వర్తిస్తాయి. అది కూడా అమెజాన్, వన్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, వన్ ప్లస్ డాట్ ఇన్ లలో మాత్రమే ఆఫర్లు ఉంటాయి.
వన్‌ప్లస్ టీవీలపై ఆఫర్లు..
- వన్ ప్లస్ టీవీ 43 వై1ఎస్ ప్రో, 50 వై1ఎస్ ప్రోలను కొనుగోలు చేసే కస్టమర్‌లు వరుసగా రూ. 2000, రూ. 2500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే 3 నెలలు, 6 నెలల కాల వ్యవధితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది.
- వన్ ప్లస్ టీవీ 55 వై1ఎస్ ప్రోపై రూ. 3000 విలువైన ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌లు పొందొచ్చు. అదే విధంగా మూడు నుంచి తొమ్మిది నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంటుంది.
- 65 క్యూ2 ప్రో కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు రూ. 5000 తక్షణ బ్యాంక్ తగ్గింపును పొందొచ్చు. అదే విధంగా 18 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది.
- వినియోగదారులు పై ఆఫర్లు ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్ లపై మాత్రమే వర్తిస్తాయి. అది కూడా అమెజాన్, వన్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, వన్ ప్లస్ డాట్ ఇన్ లలో మాత్రమే ఆఫర్లు ఉంటాయి. అయితే ఎస్బీఐ కస్టమర్లు మాత్రం ఫ్లిప్ కార్ట్ లో బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..