One plus 9RT: వచ్చేస్తోంది ‘వన్‌ప్లస్ 9 ఆర్‌టి’.. ధర, ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయంటే..?
One plus 9RT: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ OnePlus తన కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 9RTని బుధవారం ఇండియాలో లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ గురించి ఇప్పటివరకు
One plus 9RT: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ OnePlus తన కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 9RTని బుధవారం ఇండియాలో లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ గురించి ఇప్పటివరకు చాలా సమాచారం లీక్ అయింది. కొన్ని పోస్టర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో ఈ ఫోన్ స్పెసిఫికేషన్ గురించి వెల్లడించారు.
OnePlus 9RT డిజైన్ వన్‌ప్లస్ అధికారిక పోస్టర్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ అందమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్‌ల కంటే మెరుగ్గా ఉంటుంది. One Plus 9R వెనుక ప్యానెల్‌లో నాలుగు కెమెరాల సెటప్ ఉంది. One Plus 9R వలే ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది.IMX766 సెన్సార్ అందిస్తున్నారు. ఇది 50 మెగాపిక్సెల్ సెన్సార్. ఈ కెమెరా వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రోలలో ఇవ్వబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే దీనిలో ఎన్ని మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుందనే సమాచారం ఇవ్వలేదు.
One Plus 9RT స్పెసిఫికేషన్‌లు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను పొందుతుంది. దీని సమాచారం లీకైన పోస్టర్ నుంచి లభిస్తుంది. ఈ ప్రాసెసర్ 5nm వద్ద ప్రాసెస్ చేస్తుంది. ఇది చిప్‌సెట్ పనితీరును పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఇది గేమింగ్ సమయంలో మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.ఈ చిప్‌సెట్ 12GB LPDDR5 ర్యామ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో వర్చువల్ ర్యామ్‌ను 7GB వరకు పెంచుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ 256 GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంటుంది. Samsung E4 Amoled ప్యానెల్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీనికి 65W వార్ప్ ఛార్జ్ సపోర్ట్ లభిస్తుంది. చైనాలో OnePlus 9RT ధర రూ.23,250 నుంచి రూ.34,800 వరకు ఉంటుంది.