OnePlus 15R: వన్‌ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
OnePlus 15R India Launch Update: వన్‌ప్లస్ నుంచి మరో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. ఇటీవల వన్‌ప్లస్ 15 మోడల్ ఫోన్ రిలీజ్ కాగా.. ఇప్పుడు దానికి అప్‌డేట్ వెర్షన్‌గా Oneplus 15R మోడల్‌ను తీసుకొస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వివరాలు ఇప్పటికే బయటకొచ్చాయి.

OnePlus 15R India Debut Soon: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) త్వరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. వన్ ప్లస్ 15R (OnePlus 15R) పేరుతో కొత్త మోడల్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఈ డివైస్ టెస్టింగ్ స్టేజీలో ఉంది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌లో ‘కమింగ్ సూన్’ ట్యాగ్‌తో ఈ కొత్త మోడల్ ఫోన్ దర్శనమిస్తుంది. ఈ ఫోన్ మధ్యస్థాయి బడ్జెట్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ మొబైల్ మార్కెట్‌లో ఎప్పుడు రిలీజ్ కానుందన్న అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు మాత్రమే ఆ సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వెల్లడించింది. అయితే ఈ కొత్త మోడల్ వచ్చే నెలలో ఈ ఫోన్ ఇండియాలో రిలీజ్ కానుందని మార్కెట్ వర్గాల సమాచారం.
ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
-డ్యూయల్ రియర్ కెమెరా -ఆక్సిజన్ OS16 -6.83-అంగుళాల 1.5k AMOLED డిస్‌ప్లే -స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ లేదా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 SoC -అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ -50MP ప్రధాన కెమెరా -100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -7800 mAh బ్యాటరీ -రెండు వేరియంట్లు (బ్లాక్, గ్రీన్)
అమెరికాలో విడుదల ఆలస్యం
దీనికి ముందు వన్‌ప్లస్ 15 మోడల్ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ Qualcomm కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌ను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన అమెరికా మాత్రం ఆ మోడల్ ఫోన్ లాంచ్ కాలేదు. అమెరికాలో షట్‌డౌన్ కారణంగా రెగ్యూలేటరీ సర్టిఫికేషన్స్ లభించలేదు. దీని వల్ల వన్‌ప్లస్ 15 మోడల్ ఫోన్ లాంచ్ అమెరికాలో ఆలస్యమవుతుండగా.. త్వరలో అక్కడ కూడా క్లియరెన్స్ రా నుందని తెలుస్తోంది. దీనికి కొనసాగింపుగా అడ్వాన్స్ ఫీచర్లతో 15R మోడల్ ఫోన్‌ను త్వరలో వన్‌ప్లస్ అందుబాటులోకి తీసుకురానుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




