Electric Scooters: ఒకాయా కంపెనీ నుంచి తక్కువ ధరలో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే లుక్ దీని స్పెషాలిటీ!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా మొదలైంది. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ లో పోటీ పెరిగింది. ఓలా స్కూటర్ ఒక్కరోజులో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Electric Scooters: ఒకాయా కంపెనీ నుంచి తక్కువ ధరలో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే లుక్ దీని స్పెషాలిటీ!
Okaya Electric Scooters
Follow us
KVD Varma

|

Updated on: Sep 16, 2021 | 8:59 PM

Electric Scooters: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా మొదలైంది. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ లో పోటీ పెరిగింది. ఓలా స్కూటర్ ఒక్కరోజులో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చాలా కంపెనీలు తమ బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానిని సన్నాహాలు చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఆదిశలో ముందడుగు వేశాయి. మరి కొన్ని కంపెనీలు తమ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. పరిస్థితి చూస్తూ ఉంటె రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశవ్యాప్తంగా అన్ని రోడ్లపై పరుగులు తీసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటె ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఒకాయా గ్రూప్ కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. ఆ స్కూటర్ గురించి తెలుసుకుందాం.

ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఒకాయా గ్రూప్ యొక్క EV ఆర్మ్ గురువారం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రీడమ్‌ను ప్రారంభించింది. దీని ధర రూ. 69,900. ఒకాయా చెప్పిన వివరాల  ప్రకారం, ఫ్రీడమ్ లిథియం-అయాన్, లీడ్-యాసిడ్ బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇది మార్కెట్లో కంపెనీకి మూడవ ఉత్పత్తి అవుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని బద్దిలోని తయారీ కర్మాగారం నుండి కొత్త స్కూటర్‌ను విడుదల చేస్తున్నట్లు ఆటోమేకర్ వెల్లడించింది. 

ఈ కొత్త మోడల్ నాలుగు వేరియంట్లలో లాంచ్ చేస్తున్నారు. ఇందులో తక్కువ-స్పీడ్, హై-స్పీడ్ ట్రిమ్‌లు ఉంటాయి. ఈ స్కూటర్లు  ఒక్కో ఛార్జీకి గరిష్టంగా 250 కి.మీ. మైలేజి ఇస్తాయి. 

ఒకాయా పవర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా మాట్లాడుతూ, “ఎలక్ట్రిక్ అనేది భవిష్యత్తు. ప్రతి భారతీయుడికి  తాము పెట్టే డబ్బుకు అధిక-నాణ్యత, విలువను అందించడానికి మేము ఉత్తమ ప్రయత్నాలు చేస్తున్నాము.  మా అనుబంధ వ్యాపార ఆసక్తుల కారణంగా,  మాకు మార్కెట్ ప్రదేశంలో ప్రయోజనం ఉంటుంది. ” అని చెప్పారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హై-స్పీడ్ మోటార్‌సైకిల్, ప్రత్యేకమైన B2B వాహనాలతో సహా 14 కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది -అవియోన్ఐక్యూ సిరీస్,  క్లాస్ఐక్యూ సిరీస్. ఇవి  120 డీలర్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచనున్నారు.  మరో 800  డీలర్ షిప్స్ జోడించడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు కంపెనీ చెప్పింది. 

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పీడు..

కాగా, కొనుగోలు విండో తెరిచిన బుధవారం నుండి, ఓలా ఎలక్ట్రిక్ గురువారం 600 కోర్ విలువైన ఇ-స్కూటర్లను విక్రయించినట్లు ప్రకటించింది. “మేము ప్రతి సెకనుకు 4 స్కూటర్లను విక్రయించాము! కేవలం 24 గంటల్లో, మేము 600 కోట్లకు పైగా విలువైన స్కూటర్లను విక్రయించాము! అది మొత్తం టూ వీలర్  పరిశ్రమ ఒక రోజులో విక్రయించే దానికంటే ఎక్కువ! , ” అని ఓలా  కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

జూలైలో సంస్థ తన ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 100,000 రిజర్వేషన్లను పొందిందని ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా బుక్ చేసుకున్న స్కూటర్‌గా నిలిచింది. Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర  రూ 99,999.- FAME సహా S1 ప్రో మోడల్ ధర రా 1,29,999 (ఎక్స్-షోరూమ్  కేంద్ర  సబ్సిడీ, రాష్ట్ర సబ్సిడీలను మినహాయించి).

ఓలా స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ నుండి ఒక విప్లవాత్మక ఉత్పత్తిగా చెబుతున్నారు.  క్లాస్-లీడింగ్ స్పీడ్, అపూర్వమైన రేంజ్, అతిపెద్ద బూట్ స్పేస్ అలాగే అధునాతన టెక్నాలజీతో కస్టమర్లు దీనిని కొనుగోలు చేయవచ్చు. దీనిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి దూకుడుగా ధర నిర్ణయించబడుతుందని, ఇది ప్రపంచంలోని మేడ్ ఇన్ ఇండియా, కంపెనీ  అత్యాధునిక ఫ్యూచర్ ఫ్యాక్టరీలో తయారు అవుతుందని ఓలా  కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Youtube: యూట్యూబ్‌లో మరో కొత్త ఫీచర్‌ వచ్చేస్తోంది.. ఇకపై కామెంట్లను మీకు నచ్చిన భాషలో చదవొచ్చు..